Asianet News TeluguAsianet News Telugu

నేను తీసినట్లు ఎవరైనా సినిమా తీయగలరా..? విశ్వక్ సేన్ కామెంట్స్!

విశ్వక్ సేన్ నటిస్తూ డైరెక్ట్ చేసిన సినిమా 'ఫలక్ నుమా దాస్'. తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మిశ్రమ స్పందన లభిస్తోంది. 

vishwaksen comments on tollywood directors
Author
Hyderabad, First Published Jun 3, 2019, 2:02 PM IST

విశ్వక్ సేన్ నటిస్తూ డైరెక్ట్ చేసిన సినిమా 'ఫలక్ నుమా దాస్'. తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మిశ్రమ స్పందన లభిస్తోంది. అయితే ఈ సినిమాపై నెగెటివ్ ప్రచారం చేస్తున్న వారిపై సోషల్ మీడియా వేదికగా బూతులతో కూడిన కామెంట్స్ చేశాడు విశ్వక్ సేన్. దీనిపై పెద్ద దుమారమే రేగింది. తాజాగా ఈ విషయంపై ప్రెస్ మీట్ పెట్టి  క్లారిటీ ఇచ్చాడు విశ్వక్ సేన్.

'ఫలక్ నుమా దాస్' చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తోందని, ఇప్పటికే సినిమా నాలుగు కోట్ల రూపాయలు వసూలు చేసిందని, థియేటర్లు అన్నీ కూడా హౌస్ ఫుల్ అవుతున్నాయని అన్నారు. ఇంత పాజిటివ్ రెస్పాన్స్ వస్తోన్న సినిమాపై నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారని, వాళ్లనే తాను తిట్టినట్లు, వారెవరనే విషయం తనకు నిజంగా తెలియదని అన్నాడు.

ఈ సినిమా క్లైమంస్ లో రెండు కిలోమీటర్లు పదిహేను వందల మందితో పదిహేను క్యారెక్టర్లు 13 నిమిషాల సింగిల్ టేక్ షాక్ తీశానని, అది అంత సులువు కాదని అన్నారు. ఇప్పుడున్న దర్శకులంతా సినిమాలను ఒకేరకంగా తీస్తున్నారని, ఎవడైనా కొత్తగా సినిమా తీస్తేనే ప్రేక్షకుడికి కొత్త అనుభూతి కలుగుతుందని అన్నారు.

సినిమాలో ఒక్కో సీన్‌లో నిమిషంలో వంద కట్‌లు ఉంటాయి. మరోసారి ఆరు నిమిషాల పాటు సింగిల్ కట్ కూడా లేకుండా సీన్ ఉంటుంది. అది జోక్ కాదు.. తెలుగులో ఇలాంటి సినిమాలు ఎన్ని ఉన్నాయో చూపించండి అంటూ ఛాలెంజ్ చేశాడు.

ఈ సినిమాలో తను తీసిన క్లైమాక్స్ షాట్ ఏ డైరెక్టర్ అయినా తీశాడని చూపించండి అంటూ అడిగారు. తన శ్రమకు తగ్గ ఫలితం వస్తుందని, కావాలని కొందరు నెగెటివ్ ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios