MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Trisha Krishnan: పెళ్లిపై త్రిష అదిరిపోయే రియాక్షన్‌.. ఎప్పుడు, ఎవరిని చేసుకుంటుందో చెప్పిన స్టార్‌ హీరోయిన్‌

Trisha Krishnan: పెళ్లిపై త్రిష అదిరిపోయే రియాక్షన్‌.. ఎప్పుడు, ఎవరిని చేసుకుంటుందో చెప్పిన స్టార్‌ హీరోయిన్‌

Trisha Krishnan: దళపతి విజయ్ కి ఆయన భార్య సంగీత విడాకులు ఇచ్చేందుకు రెడీ అయిన నేపథ్యంలో ఇది తమిళనాట హాట్‌ టాపిక్‌గా మారింది. ఈ క్రమంలో  పెళ్లిపై నటి త్రిష స్పందించింది. ఎవరిని, ఎప్పుడు మ్యారేజ్‌ చేసుకుంటుందో తెలిపింది. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Mar 03 2026, 12:30 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
విజయ్‌కి భార్యతో విడాకుల వేళ త్రిష ట్రెండింగ్‌
Image Credit : Instagram

విజయ్‌కి భార్యతో విడాకుల వేళ త్రిష ట్రెండింగ్‌

దళపతి విజయ్, ఆయన భార్య సంగీత సోర్ణలింగం మధ్య విభేదాలు వచ్చాయి. విజయ్‌కి విడాకులకు ఇచ్చేందుకు ఆమె రెడీ అయ్యింది. కోర్ట్ ని ఆశ్రయించింది. దీంతో సోషల్ మీడియాలో హీరోయిన్‌ త్రిష  పేరు ట్రెండ్ అవ్వడం మొదలైంది. 'గిల్లి' నుంచి 'లియో' వరకు వీరిద్దరి జోడీ అభిమానులకు ఎంతో ఇష్టం. విజయ్ పుట్టినరోజున త్రిష పెట్టిన 'హ్యాపీ బర్త్‌డే బెస్టీ' పోస్ట్ కూడా మళ్లీ వైరల్ అయింది. అయితే, వీరి మధ్య రిలేషన్‌కి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
పెళ్లిపై త్రిష కామెంట్‌
Image Credit : Instagram

పెళ్లిపై త్రిష కామెంట్‌

మే 4, 1983న పుట్టిన త్రిషకు ఇప్పుడు 42 ఏళ్లు. 2017లో ఒక ఇంటర్వ్యూలో ఆమె పెళ్లి గురించి మాట్లాడింది. "నాకు పెళ్లి వ్యవస్థపై నమ్మకం ఉంది. కానీ సమాజం కోసమో, వయసైపోతోందన్న ఒత్తిడితోనో పెళ్లి చేసుకోవడంలో నమ్మకం లేదు. నిజమైన ప్రేమ, ఎమోషనల్ కనెక్షన్ ఉన్నప్పుడే పెళ్లి చేసుకోవాలి" అని స్పష్టం చేసింది. అంటే, సరైన వ్యక్తి దొరికే వరకు ఆమె సింగిల్‌గా ఉండటానికే ఇష్టపడుతోంది.
35
గతంలో బిజినెస్‌మ్యాన్ వరుణ్ మణియన్‌తో త్రిష నిశ్చితార్థం రద్దయింది
Image Credit : Instagram

గతంలో బిజినెస్‌మ్యాన్ వరుణ్ మణియన్‌తో త్రిష నిశ్చితార్థం రద్దయింది

2015లో త్రిష చెన్నైకి చెందిన బిజినెస్‌మ్యాన్ వరుణ్ మణియన్‌తో నిశ్చితార్థం చేసుకుంది. ఇక పెళ్లి ఖాయం అనుకుంటున్న టైంలో, కేవలం 5 నెలల్లోనే ఆ బంధం ముగిసిపోయింది. ఎందుకు విడిపోయారో ఆమె చెప్పకపోవడంతో రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. వ్యక్తిగత విభేదాలు, లైఫ్‌స్టైల్‌లో తేడాలే వారి ఎంగేజ్‌మెంట్ రద్దుకు కారణమని ఇండస్ట్రీ వర్గాలు అంటుంటాయి.
45
రానా దగ్గుబాటితో త్రిష ప్రేమాయణంపై అప్పట్లో పెద్ద చర్చ
Image Credit : Instagram

రానా దగ్గుబాటితో త్రిష ప్రేమాయణంపై అప్పట్లో పెద్ద చర్చ

ఒకప్పుడు త్రిష .. నటుడు రానా దగ్గుబాటితో డేటింగ్‌ చేసిందనే రూమర్స్ వచ్చాయి. ఇద్దరూ చాలా పార్టీలు, ఈవెంట్లలో కలిసి కనిపించారు. 2018లో 'కాఫీ విత్ కరణ్' షోలో రానా ఈ విషయాన్ని ఒప్పుకున్నాడు. తాము కొంతకాలం రిలేషన్‌షిప్‌లో ఉన్నామని, కానీ తర్వాత విడిపోయామని చెప్పాడు. రానా 2020లో పెళ్లి చేసుకున్నాడు, కానీ త్రిష మాత్రం ఇప్పటికీ ఒంటరిగానే ఉండిపోయింది. 

55
విజయ్‌తో త్రిషకు నిజంగానే ఏదైనా ప్రత్యేక బంధం ఉందా?
Image Credit : Instagram

విజయ్‌తో త్రిషకు నిజంగానే ఏదైనా ప్రత్యేక బంధం ఉందా?

విజయ్, త్రిష ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ 'తిరుపాచి', 'ఆది', 'కురువి' వంటి సినిమాల్లో ఐకానిక్‌గా నిలిచింది. విజయ్ విడాకుల వార్త తర్వాత అభిమానులు ఇద్దరినీ జంటగా చూడాలనుకుంటున్నారు. కానీ ప్రస్తుతానికి ఇవన్నీ సోషల్ మీడియా ఊహాగానాలే. ఇరువైపుల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ ఇద్దరు డేటింగ్‌లో ఉన్నారని, విజయ్‌తో త్రిషకి ఎఫైర్‌ ఉందనే వాదన బలంగా వినిపిస్తోంది. 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
త్రిష
తమిళ సినిమా
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Crazy Kalyanam Release Date: రెండు వారాల ముందే అనుపమా పరమేశ్వరన్‌ `క్రేజీ కల్యాణం`.. రిలీజ్‌ డేట్‌ ఇదే
Recommended image2
Kajal Aggarwal Mysore Palace: మైసూర్ ప్యాలెస్‌లో కాజల్ సందడి.. అది చూసి చందమామ సర్‌ప్రైజ్‌
Recommended image3
Top 5 Flop Movies: రజనీ, సూర్య, అజిత్‌, విక్రమ్‌.. ఓవర్ హైప్ ఇచ్చి అట్టర్ ఫ్లాప్ అయిన సినిమాలు
Related Stories
Recommended image1
Rashmika Mandanna: పిల్లలపై రష్మిక కామెంట్‌, ఇప్పటికే తల్లి ఫీలింగ్‌.. త్వరలో సినిమాలకు గుడ్‌ బై?
Recommended image2
Balakrishna Movie: రాఘవేంద్రరావు చేసిన పాడు పని వల్ల బ్లాక్‌ బస్టర్‌ కావాల్సిన బాలయ్య సినిమా డిజాస్టర్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved