MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Virosh Sangeeth Party: తెల్లవారుజామున 4 గంటల వరకు సంగీత్‌ పార్టీ.. నవాబ్‌లను తలపించే లుక్‌.. విజయ్‌, రష్మిక ఎమోషనల్‌

Virosh Sangeeth Party: తెల్లవారుజామున 4 గంటల వరకు సంగీత్‌ పార్టీ.. నవాబ్‌లను తలపించే లుక్‌.. విజయ్‌, రష్మిక ఎమోషనల్‌

విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్నా సోమవారం రాత్రి సంగీత్‌ పార్టీలో పాల్గొన్నారు. ఉదయం 4 గంటల వరకు నాన్ స్టాప్ గా ఎంజాయ్‌ చేశారు. ఈ సందర్భంగా దిగిన ఫోటోలను పంచుకుంటూ విజయ్‌ ఎమోషనల్‌ అయ్యారు. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Mar 03 2026, 11:32 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110
విరోష్‌ జంట సంగీత్‌ పార్టీ
Image Credit : Asianet News

విరోష్‌ జంట సంగీత్‌ పార్టీ

విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్నా పెళ్లి ఇటీవలే గ్రాండ్‌గా జరిగింది. రాజస్థాన్‌లోని ఉదయ్‌ పూర్‌ ప్యాలెస్‌లో అండరంగ వైభవంగా, రాజులను తలపించేలా మ్యారేజ్‌ చేసుకున్నారు. ఆ తర్వాత సొంతూరులో సత్యనారాయణ వ్రతం పూర్తి చేసుకున్న విరోష్‌ జంట. ఈ రాత్రి సంగీత్‌ పార్టీలో రెచ్చిపోయారు. చాలా గ్రాండ్ గా ఈ సంగీత్‌ పార్టీ జరిగింది.

210
నవాబ్‌లను తలపించే కాస్ట్యూమ్స్ తో విరోష్‌ జంట సంగీత్‌ పార్టీ
Image Credit : Asianet News

నవాబ్‌లను తలపించే కాస్ట్యూమ్స్ తో విరోష్‌ జంట సంగీత్‌ పార్టీ

నవాబ్‌లను, రాజులను తలపించేలా ఈ పార్టీ జరగడం విశేషం. విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్నా ధరించిన దుస్తులు, వేడుక డెకరేషన్‌, పాటలకు డాన్స్ చేయడం ఇలా ఈ విరోష్‌ జంట రాత్రి బాగా ఎంజాయ్‌ చేశారు.

Related Articles

Related image1
Rashmika Mandanna: పిల్లలపై రష్మిక కామెంట్‌, ఇప్పటికే తల్లి ఫీలింగ్‌.. త్వరలో సినిమాలకు గుడ్‌ బై?
Related image2
Rakshit Shetty: ఒంటరిగానే ఉండటమే ఇష్టం.. విజయ్‌ దేవరకొండతో రష్మిక పెళ్లి తర్వాత రక్షిత్‌ శెట్టి షాకింగ్‌ రియాక్షన్‌
310
సంగీత్‌ పార్టీ ఫోటోలు పంచుకున్న విజయ్‌ దేవరకొండ
Image Credit : Asianet News

సంగీత్‌ పార్టీ ఫోటోలు పంచుకున్న విజయ్‌ దేవరకొండ

 ఈ సందర్భంగా దిగిన ఫోటోలను విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్నా పంచుకున్నారు. తమ ఆనందాన్ని షేర్‌ చేసుకున్నారు. ఈ సందర్భంగా విజయ్‌ దేవరకొండ ఎమోషనల్‌ అయ్యారు. ఆయన ఇన్‌ స్టాగ్రామ్‌లో ఎమోషనల్‌ పోస్ట్ పెట్టారు.

410
కన్నీళ్లు వచ్చేంత నవ్వుతూ
Image Credit : Asianet News

కన్నీళ్లు వచ్చేంత నవ్వుతూ

 `మా సంగీత్‌ నైట్‌, కన్నీళ్లు వచ్చేంత వరకు నవ్వుతూ, మా పాదాల నొప్పి కలిగేంత వరకు డాన్స్ చేస్తూ, అందరి ప్రసంగాలకు భావోద్వేగాలను కంట్రోల్‌ చేసుకుంటూ, ఆశ్చర్యాలతో కన్నీళ్లు కార్చుతూ గడిపిన సాయంత్రం. అందమైన వ్యక్తులతో నిండిన పెద్ద సంతోషకరమైన పార్టీ ఇది.

510
ప్రత్యేకంగా డిజైన్‌ చేసిన దుస్తులతో విజయ్‌
Image Credit : Asianet News

ప్రత్యేకంగా డిజైన్‌ చేసిన దుస్తులతో విజయ్‌

@falgunishanepeacockindia ప్రత్యేకంగా డిజైన్‌ చేసిన దుస్తులు మంత్రవిద్య చేశాయి. వారు డ్రాగన్‌లను బయటకు తీసుకొచ్చారు. 

610
ఉదయం 4గంటల వరకు పార్టీ
Image Credit : Asianet News

ఉదయం 4గంటల వరకు పార్టీ

నేను తెల్లవారు జామున 4 గంటల వరకు ఆ పార్టీలోనే మునిగితేలాము` అని పేర్కొన్నారు విజయ్‌ దేవరకొండ. ఈ సందర్బంగా పార్టీలో ఎంజాయ్‌ చేస్తూ, పార్టీని సెలబ్రేట్‌ చేస్తూ రష్మిక కలిసి దిగిన ఫోటోలను పంచుకున్నారు.

710
విజయ్ దేవరకొండ ఫ్యామిలీ ఎమోషనల్‌ మూమెంట్స్
Image Credit : Asianet News

విజయ్ దేవరకొండ ఫ్యామిలీ ఎమోషనల్‌ మూమెంట్స్

ఇందులో రష్మిక మందన్నాని ఎత్తుకుని విజయ్‌ దేవరకొండ డాన్స్ చేయడం అదిరిపోయింది. ఆమెతో బెస్ట్ మూమెంట్లని పంచుకున్నారు. ఈ సందర్భంగా ఫ్యామిలీ సభ్యులు విజయ్‌, రష్మిక జంటని ఉద్దేశించి మాట్లాడారు. విజయ్‌ అమ్మ ఎమోషనల్‌ అయ్యింది. ఈ ఫోటోలు ఇప్పుడు అందరిని ఆకట్టుకుంటున్నాయి.

810
రహస్యంగా విజయ్‌, రష్మిక లవ్‌ స్టోరీ
Image Credit : Asianet News

రహస్యంగా విజయ్‌, రష్మిక లవ్‌ స్టోరీ

హీరో విజయ్‌ దేవరకొండ, హీరోయిన్‌ రష్మిక మందన్నా కలిసి `గీత గోవింద`, `డియర్‌ కామ్రేడ్‌` చిత్రంలో నటించారు. ఆ సమయంలోనే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఇన్నాళ్లు తమ ప్రేమని రహస్యంగా ఉంచారు ఈ విరోష్‌ జంట. 

910
విజయ్‌, రష్మిక లవ్‌ స్టోరీని బయటపెట్టిన నెటిజన్లు
Image Credit : Asianet News

విజయ్‌, రష్మిక లవ్‌ స్టోరీని బయటపెట్టిన నెటిజన్లు

అయితే వెకేషన్‌కి వెళ్లినప్పుడు మాత్రం హింట్‌ ఇస్తూ వచ్చారు. ఇద్దరు ఒకే ప్లేస్‌లో వేర్వేరుగా దిగుతూ ఫోటోలు పంచుకున్నారు. దీంతో అభిమానులు, నెటిజన్లు మాత్రం వీరి రహస్య ప్రేమని బహిర్గతం చేస్తూనే వచ్చారు. 

1010
మార్చి 4న విజయ్‌, రష్మిక రిసెప్షన్‌
Image Credit : Asianet News

మార్చి 4న విజయ్‌, రష్మిక రిసెప్షన్‌

రహస్యంగా ఏడేళ్లు డేటింగ్‌ చేసిన ఈ జంట ఫిబ్రవరి 26న ఒక్కటయ్యారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌ పూర్‌ ప్యాలెస్‌లో మ్యారేజ్‌ చేసుకున్నారు. ఇటు తెలుగు సాంప్రదాయం ప్రకారం, అటు కన్నడ కొడువ సాంప్రదాయం ప్రకారం ఈ ఇద్దరు పెళ్లి చేసుకోవడం విశేషం. ఈ బుధవారం(మార్చి 4)న గ్రాండ్‌గా రిసెప్షన్‌ ప్లాన్‌ చేశారు. 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
విజయ్ దేవరకొండ
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
తెలుగు సినిమా
రష్మిక మందన్న

Latest Videos
Recommended Stories
Recommended image1
Gunde Ninda Gudi Gantalu: మీనాని అవమానించిన చింటూ అమ్మమ్మ, రోహిణీ ప్లాన్ పసిగట్టిన బాలు
Recommended image2
Actress: సంతోషం బ్యూటీ ఇప్పుడెలా ఉందో తెలుసా.? చూస్తే షాక్ అవ్వాల్సిందే
Recommended image3
Illu Illalu Pillalu మార్చి 3 ఎపిసోడ్: రామరాజు కొడుకుల మధ్య గొడవలు, ఇంట్లోంచి బయటికొచ్చేసిన సాగర్ నర్మద
Related Stories
Recommended image1
Rashmika Mandanna: పిల్లలపై రష్మిక కామెంట్‌, ఇప్పటికే తల్లి ఫీలింగ్‌.. త్వరలో సినిమాలకు గుడ్‌ బై?
Recommended image2
Rakshit Shetty: ఒంటరిగానే ఉండటమే ఇష్టం.. విజయ్‌ దేవరకొండతో రష్మిక పెళ్లి తర్వాత రక్షిత్‌ శెట్టి షాకింగ్‌ రియాక్షన్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved