'ఫలక్ నుమా దాస్' చిత్రంతో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన విశ్వక్ సేన్ ఓ వివాదంలో ఇరుక్కున్నాడు. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ని ఉద్దేశించి విశ్వక్ ఏవో కామెంట్స్ చేశాడని దుమారం రేగింది. రివ్యూ రైటర్స్ ని కూడా తక్కువ చేసి మాట్లాడాడని, కొందరిని టార్గెట్ చేస్తూ వివాదాస్పదంగా కామెంట్స్ చేశాడని వచ్చిన వార్తలపై విశ్వక్ సేన్  స్పందించి.. తను ఏ హీరోని, అభిమానులను ఉద్దేశిస్తూ ఆ వ్యాఖ్యలు చేయలేదని అన్నారు.

తను ఇన్స్టాగ్రామ్ లో ఓ పోస్ట్ పెడితే.. పెట్టిన నలభై సెకన్ల వీడియోను వదిలేసి చివరు ఆరు సెకన్లు పట్టుకొని తనను టార్గెట్ చేస్తున్నారని ఓ ప్రముఖ టీవీ ఛానెల్ లైవ్ లో మాట్లాడారు. ప్రెస్ మీట్ పెట్టి మరీ క్లారిటీ ఇచ్చానని మరోసారి ఛానెల్ కూడా అడుగుతున్నారని తను ఓ నిర్మాతను ఉద్దేశించి కామెంట్స్ చేశానని అన్నారు.

అయితే అప్పటికీ యాంకర్ విశ్వక్ సేన్ తో ఎలాగోలా కొన్ని పేర్లు చెప్పించాలని విశ్వప్రయత్నాలు చేసింది. అడిగిన ప్రశ్ననే తిప్పి తిప్పి అడుగుతుండడంతో సహనం కోల్పోయిన విశ్వక్ సేన్ యాంకర్ ని లైవ్ లోనే ఆడేసుకున్నాడు. మీడియా అనవసర రాద్దాంతం చేస్తుందని, మీకు కావాల్సిన పేర్లు చెప్పేవరకు ఇలానే లాగి లాగి ఏదొకటి అడుగుతూనే ఉంటారని సెటైర్లు వేశాడు.

ఇలా ప్రశ్నించడానికి మీకు డబ్బులు ఇస్తున్నారని, తనకు ఎవరూ పే చేయరని కామెంట్స్ చేశాడు. దీంతో ఖంగుతిన్న యాంకర్ కి ఎలా స్పందించాలో అర్ధం కాలేదు. ఇంతలో విశ్వక్ తను చెప్పాలనుకున్నది చెప్పేశానని అందరూ సినిమా చూసి ఎంజాయ్ చేయండి అంటూ ఫోన్ కట్ చేసేశాడు.