వెళ్లిపోమాకే, ఈ నగరానికి ఏమైంది చిత్రాల్లో నటించిన  ఫలక్‌నుమా దాస్‌ మూవీ  మొన్న శుక్రవారం రిలీజైంది. ఈ చిత్రం బాగోపోవటంతో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్స్   సంగతి తెలిసిందే. అయితే వీటిని దర్శకుడు, నటుడు అయిన విశ్వక్ సేన్ తట్టుకోలేకపోతున్నారు. ఈ సినిమాపై నెగిటివ్‌ కామెంట్స్ చేస్తున్నవారికి వార్నింగ్ ఇస్తూ.. బూతులతో రెచ్చిపోయాడు హీరో విశ్వక్ సేన్. ఈ సందర్భంగా వీడియో విడుదల చేస్తూ సినిమా బాలేదన్న వారిపై పచ్చి బూతులతో తిట్టిపోసాడు.

‘ప్రస్తుతం విజయవాడలో ఉన్నా.. హైదరాబాద్‌ వస్తున్నా. విజయవాడలో ‘ఫలక్‌నుమా దాస్’ సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తుంది. అందరూ బాగుంది అంటున్నారు. ఈ సినిమా సక్సెస్ మీట్‌ను కూడా నిర్వహిస్తా. నేను చాలా మందికి ఆన్సర్ చెప్పాలి. ఒక్కొక్కడ్ని దెం*** షేప్ అవుట్ అవుతాడు. పిచ్చి లం*** కొడుకులు’ అంటూ బూతులతో రెచ్చిపోయాడు ‘ఫలక్‌నుమా దాస్’ దర్శకుడు, హీరో విశ్వక్ సేన్. 

మళయాళ హిట్ చిత్రం అంగనమల డైరీస్ రీమేక్  తీసుకుని హైదరాబాద్ నేటివిటీకి తగిన విధంగా కథలో మార్పులు చేసి రూపొందించిన ఈచిత్రం మే 31న విడుదలైంది. సినిమా రిలీజ్ ముందే ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ రావడంతో అంచనాలు పెరిగాయి. 'అర్జున్ రెడ్డి' లాగా ఉంటుందని మీడియాలో ప్రచారం జరిగింది. దాంతో ఈ చిత్రానికి రిలీజ్ ముందే పేయిడ్ ప్రివ్యూలకు డిమాండ్ ఏర్పడింది. అయితే సినిమా రిలీజైన తర్వాత రెస్పాన్స్ రివర్స్ అయ్యింది.  ఫస్టాఫ్ ఎంటర్టైన్మెంట్ గా ఉన్నప్పటికీ సెకండాఫ్ నిరాశ పరిచింది.