దర్శకుడు సురేందర్ రెడ్డి చిరంజీవిని మునుపెన్నడూ చూడని విధంగా ఉయ్యాలవాడ పాత్రలో పవర్ ఫుల్ గా చూపించబోతున్నాడు. చిరంజీవి బ్రిటిష్ వారితో తలపడే సన్నివేశాల కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా కొన్ని సన్నివేశాలు హైలైట్ అయ్యేలా, అభిమానుల్లో సినిమాపై ఆసక్తిని పెంచేలా సురేందర్ రెడ్డి ట్రైలర్ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. 

ఈ చిత్రంలో తమన్నా, నయనతార, బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్, కిచ్చా సుదీప్, జగపతి బాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో సైరా నరసింహారెడ్డి పాత్రని పరిచయం చేసేది అనుష్కనే కావడం విశేషం. అనుష్కకు సంబంధించిన ఓ షాట్ ని కూడా ట్రైలర్ కో కట్ చేసినట్లు తెలుస్తోంది. అనుష్క ఈ చిత్రంలో ఝాన్సీ లక్ష్మీ బాయి పాత్రలో నటిస్తోంది. 

ఆమె నరసింహారెడ్డి వీరత్వాన్ని తన సైనికులకు వివరించే సన్నివేశాలు సైరాలో చిత్రీకరించారు. దాదాపు మూడు నిమిషాల నిడివి ఉండే ట్రైలర్ లో దర్శకుడు సురేందర్ రెడ్డి అండర్ వాటర్ లో చిత్రీకరించిన ఫైట్స్ ని చూపించబోతున్నాడు. ఈ ఫైట్ లో శివలింగంకి సంబంధించిన అంశం కూడా ఉందని వినికిడి. ఏది ఏమైనా మరికొద్ది గంటల్లో ఉత్కంఠకు తెరపడనుంది. 

దయచేసి ఆ సీన్ ట్రైలర్ లో చూపించొద్దు.. వేడుకుంటున్న మెగా ఫ్యాన్స్!

'సైరా' ప్రీరిలీజ్ బిజినెస్.. దిల్ రాజు సహా ఎవరెవరంటే!

బాంబులా పేలిన 'సైరా' డిజిటిల్ రైట్స్ ధర.. వామ్మో ఇంతా!

మెగా ఫ్యాన్స్ లో కలవరం.. వెనుకబడ్డ 'సైరా' ప్రమోషన్స్

బాహుబలిని మించిపోయిన 'సైరా'!

మెగాస్టార్ ఉగ్రరూపం.. థియేటర్లలో సైరా ట్రైలర్!

అఫీషియల్: 'సైరా' ప్రీరిలీజ్ ఈవెంట్ వాయిదా.. కారణం ఇదే!