మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సైరా నరసింహారెడ్డి చిత్ర ట్రైలర్ ని సెప్టెంబర్ 18న విడుదల చేయనున్నారు. సైరా ట్రైలర్ రిలీజ్ కు టైం కుదిరినట్లు తెలుస్తోంది. బుధవారం రోజు సాయంత్రం 5గంటలకు సైరా ట్రైలర్ రిలీజ్ కు ముహూర్తం నిర్ణయించారు. 

ఇదిలా ఉండగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలలో థియేటర్స్ లో సైరా ట్రైలర్ ప్రదర్శన ఉండబోతోంది. విజయవాడలోని అప్సర థియేటర్, గుడివాడలోని జి3  సింధూర, బందర్ లోని శ్రీ వెంకట్ థియేటర్స్ లో సైరా చిత్ర ట్రైలర్ ని ప్రదర్శించనున్నారు. 

ఇదిలా ఉండగా నైజాం ఏరియాలో సుదర్శన్ లాంటి థియేటర్స్ లో సైరా ట్రైలర్ ప్రదర్శన ఉండబోతోంది. నైజాం థియేటర్స్ వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారు. ట్రైలర్ రిలీజ్ సందర్భంగా తాజాగా చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్ అద్భుతంగా ఉంది. ఇప్పటికే అభిమానులు సైరా ట్రైలర్ కోసం సోషల్ మీడియాలో హంగామా మొదలు పెట్టారు.