Asianet News TeluguAsianet News Telugu

'సైరా' ప్రీరిలీజ్ బిజినెస్.. దిల్ రాజు సహా ఎవరెవరంటే!

మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి చిత్రం భారీ అంచనాల నడుమ ప్రపంచ వ్యాప్తంగా అక్టోబర్ 2న రిలీజ్ కు రెడీ అవుతోంది. దీనితో సైరా హంగామా మెగా అభిమానుల్లో కనిపిస్తోంది. సైరా చిత్ర విశేషాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. 

Megastar Chiranjeevi's SyeRaa movie pre release business
Author
Hyderabad, First Published Sep 17, 2019, 7:10 PM IST

మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి చిత్రం భారీ అంచనాల నడుమ ప్రపంచ వ్యాప్తంగా అక్టోబర్ 2న రిలీజ్ కు రెడీ అవుతోంది. దీనితో సైరా హంగామా మెగా అభిమానుల్లో కనిపిస్తోంది. సైరా చిత్ర విశేషాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. 

సైరా చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థలన్నీ ముందుకు వచ్చాయి. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కూడా సైరా డిస్ట్రిబ్యూషన్ లో ఇన్వాల్వ్ అయ్యారు. సైరా చిత్ర డిస్ట్రిబ్యూషన్ వివరాల్లోకి వెళితే.. నైజాం ఏరియా హక్కులని యువి క్రియేషన్స్ సంస్థ దక్కించుకుంది. దిల్ రాజుతో కలసి నైజాం ఏరియాలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. నైజాం హక్కులు 30 కోట్లకు అమ్ముడయ్యాయి. 

సీడెడ్ హక్కులు 20 కోట్లకు అమ్ముడయ్యాయి. ఇందులో చిత్తూరు ఏరియాలో మాత్రం ఎన్వీ ప్రసాద్, కర్నూలులో కొండూరు మధు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు.అనంతపూర్ లో సైరా చిత్రాన్ని ఎస్వీ మాక్స్ థియేటర్ ఓనర్ రిలీజ్ చేస్తున్నారు. 

ఉత్తరాంధ్రలో సైరా హక్కులని క్రాంతి ఫిలిమ్స్ సంస్థ 14.5 కోట్ల రికార్డ్ ధరకు హక్కులని దక్కించుకుంది. ఇక గుంటూరులో సైరా ప్రీరిలీజ్ బిజినెస్ బాహుబలి చిత్రాన్ని మించి పోయింది. గుంటూరు రైట్స్ ని యువి క్రియేషన్స్ సంస్థ 11.5 కోట్లకు దక్కించుకుంది. 

ఈస్ట్ గోదావరి హక్కులని విజయలక్ష్మి ఫిలిమ్స్ సంస్థ 9.8 కోట్లకు సైరా హక్కులని సొంతం చేసుకుంది. కృష్ణా ఏరియాలో ప్రముఖ నిర్మాత బన్నీ వాసు సైరా చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. ఈ ఏరియాలో సైరా హక్కుల ధర 7.8 కోట్లు. వెస్ట్ గోదావరిలో ఉషా పిక్చర్స్ 8.3 కోట్లకు, నెల్లూరులో హరి పిక్చర్స్ 4.8 కోట్లకు సైరా హక్కులని సొంతం చేసుకున్నారు. 

మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లోనే సైరా చిత్రానికి జరిగిన ప్రీరిలీజ్ బిజినెస్ విలువ 107.9 కోట్లు. ఓవర్సీస్ విషయానికి వస్తే నార్త్ అమెరికాలో ఈ చిత్రాన్ని స్నో ఫ్లేక్ సినిమా సంస్థ సైరా చిత్రాన్ని విడుదల చేస్తోంది. మిగిలిన ఓవర్సీస్ ప్రాంతాల్లో ఫార్స్ ఫిలిం సంస్థ సైరా హక్కులని దక్కించుకుంది. 

కర్ణాటకలో ధీరజ ఎంటర్ప్రైజెస్, తమిళనాడులో సూపర్ గుడ్ ఫిలిమ్స్, కేరళలో జెమిని స్టూడియోస్ సంస్థలు సైరా చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నాయి. 

బాంబులా పేలిన 'సైరా' డిజిటిల్ రైట్స్ ధర.. వామ్మో ఇంతా!

మెగా ఫ్యాన్స్ లో కలవరం.. వెనుకబడ్డ 'సైరా' ప్రమోషన్స్

బాహుబలిని మించిపోయిన 'సైరా'!

మెగాస్టార్ ఉగ్రరూపం.. థియేటర్లలో సైరా ట్రైలర్!

అఫీషియల్: 'సైరా' ప్రీరిలీజ్ ఈవెంట్ వాయిదా.. కారణం ఇదే!

Follow Us:
Download App:
  • android
  • ios