ఉయ్యాలవాడ జీవిత చరిత్ర ఆధారంగా సైరా నరసింహారెడ్డి చిత్రం తెరకెక్కుతోంది. మెగాస్టార్ ని ఉద్యమవీరుడిగా చూసేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి అభిమానులని మెప్పించే విధంగా ఈ చిత్రంలో అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తోంది. మెగా పవర్ స్టార్ రాంచరణ్ బడ్జెట్ విషయంలో ఏమాత్రం రాజీ పడకుండా దాదాపు 250 కోట్లకు పైగా ఖర్చుతో ఈ చిత్రాన్ని నిర్మించారు. 

చిరంజీవికి కానీ, సురేందర్ రెడ్డికి కానీ ఈ చిత్రంలో బిగ్గెస్ట్ ఛాలెంజ్ అంటే క్లైమాక్స్ సన్నివేశమే అని సినీవర్గాల నుంచి టాక్. ఎందుకంటే స్వాతంత్ర నేపథ్యంలో ఉన్న చిత్రలేవైనా ట్రాజడీ ఎండింగ్ తోనే ఉంటాయి. కానీ బ్రిటిష్ వారు మరీ దారుణంగా నరసింహారెడ్డి తల నరికి గుమ్మానికి వేలాడదీస్తారు. 

దీనితో మెగా అభిమానులు సోషల్ మీడియా వేదికగా చిత్ర యూనిట్ ని వేడుకుంటున్నారు. అలాంటి క్లైమాక్స్ కి సంబంధించిన సన్నివేశాలు ఎట్టి పరిస్థితుల్లో ట్రైలర్ లో చూపించవద్దు. మెగాస్టార్ మేము ఆ విధంగా చూడలేం. ఇక సినిమాలు ఎలాగూ తప్పదు కదా అని కామెంట్స్ పెడుతున్నారు. 

మాకు అందించిన సమాచారం మేరకు సైరా ట్రైలర్ లో అండర్ వాటర్ ఫైట్ సీన్, యుద్దానికి సంబంధించిన కొన్ని షాట్స్, గ్రాండ్ గా చిత్రకరించిన ఓ పాటలోని షాట్స్ చూపించబోతున్నట్లు తెలుస్తోంది. చిరంజీవి పవర్ ఫుల్ గ చెప్పే ఓ డైలాగ్ ట్రైలర్ లో హైలైట్ కాబోతున్నట్లు సమాచారం. మొత్తంగా సైరా ట్రైలర్ కోసం సోషల్ మీడియాలో అభిమానులు అప్పుడే హంగామా మొదలు పెట్టారు. 

 

'సైరా' ప్రీరిలీజ్ బిజినెస్.. దిల్ రాజు సహా ఎవరెవరంటే!

బాంబులా పేలిన 'సైరా' డిజిటిల్ రైట్స్ ధర.. వామ్మో ఇంతా!

మెగా ఫ్యాన్స్ లో కలవరం.. వెనుకబడ్డ 'సైరా' ప్రమోషన్స్

బాహుబలిని మించిపోయిన 'సైరా'!

మెగాస్టార్ ఉగ్రరూపం.. థియేటర్లలో సైరా ట్రైలర్!

అఫీషియల్: 'సైరా' ప్రీరిలీజ్ ఈవెంట్ వాయిదా.. కారణం ఇదే!