మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో నటించడం చిరంజీవి కల. రాంచరణ్ నిర్మాతగా చిరంజీవి కల సాకారం అవుతోంది. ఈ భారీ చిత్రాన్ని స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి తెరకెక్కించారు. 

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కర్నూలు జిల్లాకు చెందిన తొలి తెలుగు స్వాతంత్ర ఉద్యమ వీరుడు. ఆయన గురించి ప్రజలకు తెలిసిన చరిత్ర చాలా తక్కువ. చరిత్ర మరచిపోయిన ఈ వీరుడి కథని సైరా చిత్రంలో సురేందర్ రెడ్డి చూపించబోతున్నారు. మెగాస్టార్ చిరంజీవి నరసింహారెడ్డి పాత్ర నటిస్తుండడంతో ఈ చిత్రానికి మరింత క్రేజ్ వచ్చింది. 

సైరా చిత్రానికి ఇప్పటికే అన్ని ఏరియాల్లో థియేటర్ బిజినెస్ అదిరిపోయే రేంజ్ లో జరిగింది. కొన్ని ప్రాంతాల్లో బాహుబలి చిత్రాన్ని సైతం ప్రీరిలీజ్ బిజినెస్ లో సైరా అధికమించింది. 

తాజాగా ఈ చిత్ర డిజిటల్ రైట్స్ బిజినెస్ కూడా ముగిసింది. కళ్ళు చెదిరే ధరకు ప్రముఖ జీ నెట్వర్క్ సైరా డిజిటల్ హక్కులని సొంతం చేసుకుంది. ఇందులోనే శాటిలైట్ హక్కులు కూడా ఉన్నాయి. సైరా చిత్రానికి ఉన్న క్రేజ్ కారణంగా జీ నెట్వర్క్ 125 కోట్ల కళ్ళు చెదిరే ధరకు డిజిటల్ రైట్స్ సొంతం చేసుకుంది. అన్ని భాషల్లో డిజిటిల్, శాటిలైట్ హక్కులు ఈ డీల్ లోకి వస్తాయి.