Asianet News TeluguAsianet News Telugu

‘సీటీమార్’: ఆ హీరో రిజెక్ట్ చేస్తేనే గోపిచంద్ చేసాడు!?

వినాయక చవితి కానుకగా ఈ నెల 10న రాబోతున్న ‘సీటీమార్’ సినిమా విడుదలకు ముందే, దాని ట్రైలర్ ను చూసి మెగాస్టార్ చిరంజీవి దర్శకుడు సంపత్ నందితో పాటు ఆ చిత్ర బృంధానికి శుభాకాంక్షలు తెలిపారు.

who is the First choice for Gopichand seetimaar
Author
Hyderabad, First Published Sep 7, 2021, 10:17 AM IST


థియేట‌ర్లు తెర‌చుకుని సినిమాలు రిలీజ్ అవుతున్నా జ‌నాలే ఇంకా థియేట‌ర్లకు రాని పరిస్దితి. మంచి మాస్ సినిమా ప‌డితేనే జ‌నాలు వస్తారు అని ఇండస్ట్రీ నమ్ముతున్న ఈ ద‌శ‌లో `సిటీమార్` విడుద‌ల అవుతోంది. గోపీచంద్, త‌మన్నా జంట‌గా న‌టించిన సినిమా ఇది. సంప‌త్ నంది ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈనెల 10న రిలీజ్ కానుంది. ఇటీవల విడుదలైన ట్రైలర్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది.

మంచి ఎక్సపెక్టేషన్స్ తో రిలీజ్ అవుతున్న ఈ చిత్రంతో హిట్టు కొట్టి కంబ్యాక్ ఇస్తాడు గోపీచంద్.. అంటూ ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీ వర్గాలు కూడా నమ్ముతున్నాయి. ఇక అసలు విషయానికి వస్తే ఈ చిత్రానికి ఫస్ట్ ఛాయిస్ గోపీచంద్ కాదట. మొదట ఈ కథని వేరే హీరోకి వినిపించాడట దర్శకుడు సంపత్ నంది. ఆ హీరో మరెవరో కాదు రామ్ పోతినేని అని తెలుస్తోంది. రామ్ కు ఈ కథ నచ్చినప్పటికీ కోచ్ గా చేయడానికి కాస్త లుక్ ఉండే  ఓ పెద్ద మాస్ హీరో అయితే బాగుంటుందని.. తన ఏజ్ కి సరిపడదని రిజెస్ట్ చేసారట. 

ఆ తర్వాత ఈ కథని రాంచరణ్ కు చెప్దామనుకున్నారట. కానీ రాంచరణ్ ను ఈ పాత్రలో సెట్ అవడని సంపత్ వద్దనుకున్నారట. చివరాఖరికి గోపీచంద్ కు చెప్పడం.. వెంటనే ఓకే చేయడం జరిగింది.గతంలో గోపీచంద్- సంపత్ నంది కాంబినేషన్లో ‘గౌతమ్ నంద’ అనే చిత్రం వచ్చింది. అది ఆడలేదు. అయినప్పటికీ  ‘సీటీమార్’ చేశారు గోపీచంద్- సంపత్ నంది. తమ కథమీద నమ్మకంతోనే గోపిచంద్ ఓకే చెప్పాడంటున్నారు.
 
 గోపీచంద్,తమన్నా హీరో హీరోయిన్లుగా సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సీటీమార్’. పవన్‌ కుమార్ స‌మ‌ర్పణ‌లో ‘శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌’ బ్యానర్ పై శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. హిప్పీ బ్యూటీ దిగంగన సూర్య వంశీ, భూమిక వంటి వారు కూడా ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios