బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ ఏడాది 'గల్లీ బాయ్' సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ఈ హీరో ప్రస్తుతం '83' అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇండియన్ క్రికెటర్ కపిల్ దేవ్ జీవితం చరిత్రతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. 

ఇది ఇలా ఉండగా.. తాజాగా ఈ హీరో తన కొత్త కారులో ముంబైలో షికారు చేస్తూ కనిపించారు. ఇంకా పర్మినెంట్ రిజిస్ట్రేషన్ నంబర్ రాని కారులో రణవీర్ షికారు చేస్తూ.. కొత్త కారు కొన్న విషయాన్ని తెలియజేశాడు. లాంబోర్ఘినీ యూరస్ మోడల్ కారు అది. దాని విలువ ఎంత ఉంటుందో తెలుసా..? మూడు కోట్లకు పైగానే..

రీసెంట్ గానే రణవీర్ ఈ కారును సొంతం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఆ కారుని తనే స్వయంగా ముంబై  వీధుల్లో నడుపుతూ ఫోటోలను ఫోజులిచ్చాడు. దీంతో రణవీర్ కారు స్టోరీ బయటకి వచ్చింది. రణవీర్ లాంటి హీరో మూడు కోట్లు పెట్టి కారు కొనడం పెద్ద విషయమేమీ కాదు.

ఒక్కో సినిమాకి కోట్లలో రెమ్యునరేషన్ తీసుకునే రణవీర్ కి మూడు కోట్లు అనేది తను ఒక సినిమా తీసుకునే రెమ్యునరేషన్ లో నాలుగో వంతు. కానీ మూడు కోట్ల విలువైన కారు అంటే ఇండియన్స్ కి అది పెద్ద విషయమే. రణవీర్ గ్యారేజ్ లో ఇలాంటి కార్లు మరిన్ని ఉండే ఉంటాయి!