Asianet News TeluguAsianet News Telugu

Vikranth Rona Trailer: అదరగొట్టిన కిచ్చా సుదీప్... ఇండియన్ బ్లాక్ బస్టర్ కొడతాడా?

కిచ్చా సుదీప్ పాన్ ఇండియా వేటకు సిద్ధమవుతున్నారు. ఆయన లేటెస్ట్ మూవీ విక్రాంత్ రోణ. జులై 28న వరల్డ్ వైడ్ గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర ట్రైలర్ విడుదల చేశారు.

vikranth rona trailer kichha sudeep mind blowing performance and visuals
Author
Hyderabad, First Published Jun 23, 2022, 8:20 PM IST

దాదాపు మూడు నిమిషాలు సాగిన విక్రాంత్ రోణ ట్రైలర్ (Vikranth Rona Trailer) ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ఈ చిత్రం ఫిక్షనల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెలుస్తుండగా  పీరియాడిక్ అండ్ ప్రజెంట్ నేపథ్యంలో తెరక్కింది. ఓ భయానక గ్రామం చుట్టూ అల్లుకున్న కథే విక్రాంత్ రోణ. అందరూ భయపడే ఆ గ్రామంలోకి రోణ ప్రవేశిస్తాడు. అక్కడ ఉన్న మాయా మర్మం చేధిస్తాడు. సామాన్య జనాలు అతన్ని కూడా ఓ డెవిల్ లా భావిస్తారు. కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన విక్రాంత్ రోణ కథ ఏమిటో ఓ వ్యక్తి తెలుసుకోవాలని ఆ విలేజ్ లోకి ఎంటర్ అవుతాడు. 

కెజిఎఫ్ సక్సెస్ నేపథ్యంలో కన్నడ పరిశ్రమలో భారీ చిత్రాలు తెరకెక్కుతున్నాయి. అలాంటి భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా విక్రాంత్ రోణను చెప్పవచ్చు. ట్రైలర్ లో విజువల్స్ అదిరిపోయాయి. విక్రాంత్ రోణ గా సుదీప్ (Kichha Sudpeep)కేక పుట్టించారు. సస్పెన్సు ఎలిమెంట్స్ తో కూడిన ఈ కథకు స్క్రీన్ ప్లే ప్రాణం కావచ్చు. నిర్మాణ విలువలు చాలా రిచ్ గా ఉన్నాయి. చిత్ర ట్రైలర్ అంచనాలు పెంచేసింది. ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా విక్రాంత్ రోణ ఇండియన్ బాక్సాఫీస్ కొల్లగొట్టడం ఖాయం. 

అనూప్ బండారి విక్రాంత్ రోణ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. జాక్వీలిన్ పెర్నాండెజ్ హీరోయిన్ గా నటిస్తున్నారు. నిరూప్ బండారి, నీత అశోక్ ఇతర కీలక రోల్స్ చేస్తున్నారు. జాక్ మంజునాథ్, షాలిని మంజునాథ్ తెరకెక్కిస్తున్నారు. బి అంజనీష్ లోకనాథ్ సంగీతం అందిస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios