Asianet News TeluguAsianet News Telugu

మైక్ టైసన్ నన్ను తిట్టాడు ఆ బూతులు నేను చెప్పాలనుకోవడం లేదు 

లైగర్ లో గెస్ట్ రోల్ చేసిన మైక్ టైసన్ తనను తిట్టాడని విజయ్ దేవరకొండ తాజా ఇంటర్వ్యూలో చెప్పాడు. ఆ బూతులు ఏమిటో నేను చెప్పబోనని అన్నారు.

vijay shocks everyone by saying mike tyson abused me in liger sets
Author
First Published Aug 28, 2022, 4:38 PM IST

దర్శకుడు పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన లైగర్ మూవీలో మాజీ వరల్డ్ హెవీ ఛాంపియన్ మైక్ టైసన్ నటించిన విషయం తెలిసింది. ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్న మైక్ టైసన్ ఓ ఇండియన్ మూవీలో నటించడం ఇదే ప్రథమం. లైగర్ మూవీకి భారీ హైప్ ఏర్పడడంలో ఇది కూడా ఓ కారణం. రియల్ ఫైట్స్ లో ఛాంపియన్స్ ని మట్టికరిపించిన మైక్ తో ఈ సినిమాలో విజయ్ దేవరకొండ ఫైట్ చేశారు. సెట్స్ లో టీంతో మైక్ టైసన్ బాగా కలిసిపోయాయి. దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్ అయ్యాయి. 

కాగా లైగర్ మూవీ సెట్స్ లో మైక్ టైసన్ తనను తిట్టినట్లు విజయ్ దేవరకొండ తెలియజేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. లేటెస్ట్ ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండ ఈ విషయాన్ని బయటపెట్టారు. షూటింగ్ సమయంలో చాలాసార్లు విజయ్ దేవరకొండ నన్ను తిట్టారు. అవి ఎలాంటి బూతులో నేను చెప్పను. అయితే ఆయన ప్రేమపూర్వకంగా తిట్టడం జరిగింది. అందుకే నేను చెప్పదల్చుకోవడం లేదన్నాడు. 

అలాగే మైక్ టైసన్ కి ఇండియా అంటే చాలా ఇష్టం. ఇక్కడి ఫుడ్, మ్యూజిక్ బాగా ఇష్టపడతారు. కానీ జనాలు అంటే భయం. గతంలో మైక్ టైసన్ ఓసారి ఇండియాకు  రాగా తనను చూడడానికి జనాలు పెద్ద ఎత్తున వచ్చారట. వాళ్ళను చూసి భయంతో హోటల్ గదిలోకి వెళ్లిపోయానని టైసన్ చెప్పాడట. విజయ్ దేవరకొండ టైసన్ గురించి చేసిన ఈ కామెంట్స్ ఆసక్తిరేపుతున్నాయి. 

కాగా భారీగా ఖర్చుపెట్టి ప్రతిష్టాత్మకంగా లైగర్ తెరకెక్కించారు. అనూహ్యంగా ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద చతికల పడింది. దర్శకుడు పూరి జగన్నాధ్ తో పాటు విజయ్ కెరీర్ పై ఈ చిత్ర ఫలితం ప్రతికూల ప్రభావం చూపనుంది. లైగర్ విడుదల కాకుండానే వీరి కాంబినేషన్ లో జనగణమన మూవీ షూటింగ్ మొదలైంది. ఇది చిత్రం సైతం పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్ తో ప్లాన్ చేశారు. ఒక షెడ్యూల్ కూడా పూర్తయిన నేపథ్యంలో ప్రాజెక్ట్ ఎలాంటి మలుపు తీసుకుంటుందో చూడాలి. 

Follow Us:
Download App:
  • android
  • ios