Asianet News TeluguAsianet News Telugu

అదీ విజయ్ దేవరకొండ అంటే, గొప్ప మనసు చాటుకున్న రౌడీ హీరో.. అవయవ దానం చేస్తూ నిర్ణయం

రౌడీ హీరో విజయ్ దేవరకొండ మరోసారి తన ప్రత్యేకత చాటుకున్నాడు. అర్జున్ రెడ్డి చిత్రంతో సునామీ స్థాయిలో విజయ్ దేవరకొండ క్రేజ్ వ్యాపించింది. రీసెంట్ గా విజయ్ దేవరకొండ 'లైగర్' రూపంలో బిగ్ ఫ్లాప్ ఎదుర్కొన్నాడు. 

Vijay deverakonda announces to donate his organs
Author
First Published Nov 16, 2022, 8:05 PM IST

రౌడీ హీరో విజయ్ దేవరకొండ మరోసారి తన ప్రత్యేకత చాటుకున్నాడు. అర్జున్ రెడ్డి చిత్రంతో సునామీ స్థాయిలో విజయ్ దేవరకొండ క్రేజ్ వ్యాపించింది. రీసెంట్ గా విజయ్ దేవరకొండ 'లైగర్' రూపంలో బిగ్ ఫ్లాప్ ఎదుర్కొన్నాడు. ఈ చిత్రం విషయంలో విజయ్ దేవరకొండ, పూరి జగన్నాధ్ ఇద్దరూ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. అయితే ఒక్క ఫ్లాప్ తో వెనకడుగు వేస్తే కెరీర్ ముందుకు సాగదు. 

దీనితో విజయ్ చాలా త్వరగానే లైగర్ ఫ్లాప్ ఎఫెక్ట్ నుంచి బయట పడ్డాడు. ప్రస్తుతం తన తదుపరి చిత్రాలపై ద్రుష్టి పెడుతున్నాడు. అయితే తాజాగా విజయ్ దేవరకొండ తన గొప్ప మనసు చాటుకున్నాడు. అవయవ దానం గురించి సెలెబ్రిటీలు మాట్లాడడం చూస్తూనే ఉన్నాము. తక్కువ మంది సెలెబ్రిటీలు మాత్రమే అవయవదానం చేయడం చూస్తున్నాం. 

తాజాగా విజయ్ దేవరకొండ తన అవయవాలు దానం చేస్తూ నిర్ణయం తీసుకున్నాడు. విజయ్ దేవరకొండ నిర్ణయంతో సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. మరోసారి రౌడీ హీరో తన ప్రత్యేకత చాటుకున్నాడు అంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. 

హైదరాబాద్ లో ఇటీవల లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ ప్రాముఖ్యత తెలియజేస్తూ పేస్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఓ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ప్రస్తుతం బిజీ లైఫ్ లో ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా పడు చేసుకుంటున్నామని.. ఏ చిన్న సమస్య వచ్చిన వైద్యులని సంప్రదించాలని విజయ్ తెలిపాడు. అవయవదానం ఎంత గొప్పదో తెలియజేస్తూ తాను కూడా ఆ పని చేస్తున్నట్లు ప్రకటించాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios