విజయ్ దేవరకొండ హీరోగా నటించిన 'టాక్సీవాలా' సినిమా నవంబర్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా థియేటర్లలోకి రాకముందే సోషల్ మీడియాలోకి వచ్చేసింది. కొందరు ఆకతాయిలు ఈ సినిమాను పైరసీ చేయడంతో ఎడిటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కాకముందే ఈ సినిమా జనాల ఫోన్లలోకి వచ్చేసింది.

సినిమా చూసేసిన వారు ఏవరేజ్ అంటూ తేల్చేస్తున్నారు. అయితే ఈ విమర్శలకు ధీటుగా విజయ్ దేవరకొండ స్పెషల్ వీడియో సిద్ధం చేసి వదిలాడు. ఈ వీడియోలో కొందరు పిల్లలు వచ్చి విజయ్ దేవరకొండతో మాట్లాడతారు.

ఆ పిల్లల్లో ఒకరు 'టాక్సీవాలా మేం చూశాం.. ఏవరేజ్' అని చెప్పగా.. అది విన్న విజయ్ షాక్ తిని 'సినిమా ఇంకా విడుదల కాలేదు కదా ఎలా చూశారు..?' అని ప్రశ్నిస్తాడు. దానికి సమాధానంగా 'ఫోన్ లో ఉందిలే' అని చెబుతారు.

అది విన్న విజయ్ పోస్ట్ ప్రొడక్షన్, వీఎఫ్ఎక్స్, డిఐ, మ్యూజిక్ వర్క్ పూర్తి కాకుండా లీకైన సినిమా అంటూ వారికి అర్ధమయ్యే విధంగా చెబుతాడు. ఆ వీడియోపై మీరు ఓ లుక్కేయండి.. రాహుల్ దర్శకుడిగా వ్యవహరించిన ఈ సినిమాలో ప్రియాంక జవాల్కర్ హీరోయిన్ గా నటించగా.. మరో ముఖ్య పాత్రలో మాళవిక నాయర్ నటించింది. 

ఇవి కూడా చదవండి.. 

టాక్సీ వాలా సెన్సార్ వర్క్ ఫినిష్.. టాక్ ఏంటంటే?

కథ విని పారిపోబోయా.. విజయ్ దేవరకొండ కామెంట్స్!

విజయ్ దేవరకొండకు బన్నీ సెంటిమెంట్.. హిట్టు పక్కా!

విజయ్ దేవరకొండ హీరోయిన్ మందు కొట్టి సెట్స్ కి వెళ్లేదట!

విజయ్ దేవరకొండకి ఆ అమ్మాయి కలిసొస్తుందా..?

విజయ్ దేవరకొండ పరిస్థితి ఇలా అయిందేంటి..?

'టాక్సీవాలా' సినిమా లీక్.. విజయ్ దేవరకొండకి మరో షాక్!

విజయ్ దేవరకొండ సినిమాకి లైన్ క్లియర్!

ట్యాక్సీ వాలా ఆలస్యానికి కారణమిదే!

విజయ్ 'టాక్సీ వాలా' లిరికల్ సాంగ్: మాటే వినదుగా

విజయ్ దేవరకొండ వదిలేటట్లులేడు, తలపట్టుకున్న రవితేజ!