Asianet News TeluguAsianet News Telugu

నా యాటిట్యూడ్ మారదు.. విజయ్ దేవరకొండ కామెంట్స్!

వరుస విజయాలతో ఊపు మీదున్న విజయ్ దేవరకొండకి 'నోటా'తో బ్రేక్ పడింది. తమిళ, తెలుగు భాషల్లో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. విజయ్ క్రేజ్ కూడా ఈ సినిమాను కాపాడలేకపోయింది. దీంతో ఈ సినిమాపై పూర్తిగా నెగిటివ్ రివ్యూలు వచ్చాయి. 

vijay devarakonda about nota movie result
Author
Hyderabad, First Published Oct 10, 2018, 7:45 AM IST

వరుస విజయాలతో ఊపు మీదున్న విజయ్ దేవరకొండకి 'నోటా'తో బ్రేక్ పడింది. తమిళ, తెలుగు భాషల్లో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. విజయ్ క్రేజ్ కూడా ఈ సినిమాను కాపాడలేకపోయింది. దీంతో ఈ సినిమాపై పూర్తిగా నెగిటివ్ రివ్యూలు వచ్చాయి.

సోషల్ మీడియాలో విజయ్ ని ఉద్దేశించి ఇప్పటికైనా.. యాటిట్యూడ్ తగ్గించుకో అంటూ కామెంట్లు చేస్తున్నారు. తాజాగా 'నోటా' సినిమా రిజల్ట్ పై స్పందించిన విజయ్ దేవరకొండ ఓ పోస్ట్ పెట్టాడు. ''నా మీద ప్రేమతో సినిమా చూసేవారికి, పక్కవారు ఫెయిల్ అయితే ఆనందపడి సెలబ్రేట్ చేసుకునేవారికి అంటూ మొదలుపెట్టి.. నోటా సినిమాలో నటించినందుకు గర్వపడుతున్నాను. 

ఈ సినిమా పూర్తి బాధ్యత నాడే.. ఈ సినిమాను ప్రేమించిన ప్రేక్షకుల అందరి ప్రేమని తీసుకున్నాను. అలాగే ఈ సినిమాపై వచ్చిన విమర్శలను సీరియస్ గా తీసుకున్నాను. నావైపు ఉన్న తప్పులను సరి చేసుకున్నాను. కానీ నా యాటిట్యూడ్ మాత్రం మారదు. సక్సెస్, ఫెయిల్యూర్ ఓ రౌడీని తయారు చేయలేదు, పడగొట్టలేదు.  ఎప్పుడైతే నీకు ఎదురైన సమస్యను వదిలేస్తావో, చూసి ఆగిపోతావో అప్పుడు నువ్వు మారినట్టు.

రౌడీ అంటే కేవలం గెలవడమే కాదు.. విజయం కోసం పోరాడటం.. రౌడీలు అయినందుకు గర్వపడదాం. ఫైట్‌ చేస్తూ ఉందాం. గెలుస్తే గెలుస్తాం లేదా నేర్చుకుంటాం. నా ఫెయిల్యూర్‌ను ఎంజాయ్‌ చేస్తున్న వారికిదే సమయం.. ఇప్పుడే పండగ చేస్కోండి. వెంటనే తిరిగి వస్తా'' అంటూ రాసుకొచ్చాడు. 

ఇవి కూడా చదవండి..

'నోటా' ఫస్ట్ డే కలెక్షన్స్!

టాటా...( ‘నోటా‌’ మూవీ రివ్యూ )

'నోటా' ట్విట్టర్ టాక్.. అభిమానుల పెదవి విరుపులు!

కేటీఆర్ లుక్స్ ని మక్కీ మక్కీ దింపా: నోటా సినిమాపై విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ 'నోటా' టార్గెట్ ఎంతంటే..?

రష్మిక బ్రేకప్ పై విజయ్ దేవరకొండకి ఊహించని ప్రశ్న!

టాలీవుడ్ వారసత్వంపై విజయ్ దేవరకొండ కామెంట్స్!

Follow Us:
Download App:
  • android
  • ios