టాటా...( ‘నోటా’ మూవీ రివ్యూ )
పొలిటికల్ సినిమాలు మన తెలుగునాట కొత్తేం కాదు. అప్పట్లో కోడి రామకృష్ణ అటువంటి సినిమాలు చేసేవారు. మన రాష్ట్రంలో జరిగే అంశాలను చూపెడుతూ జనాలకి రాజకీయంపై అవగాహన కలిగిస్తూ సాగేవి. అయితే ఇప్పుడు అలాంటి సినిమాలు తగ్గిపోయాయి. అయితే ఎలక్షన్స్ దగ్గరపడుతున్న సమయంలో మళ్లీ ఆ హవా స్టార్టైంది. ఈ నేపథ్యంలో రిలీజైన ఈ సినిమా జనాల మూడ్ ని ప్రతిబింబిస్తూ సాగిందా లేక ‘నోటా’గురించి చర్చించిందా ఈ రివ్యూలో చూద్దాం.
--సూర్య ప్రకాష్ జోశ్యుల
పొలిటికల్ సినిమాలు మన తెలుగునాట కొత్తేం కాదు. అప్పట్లో కోడి రామకృష్ణ అటువంటి సినిమాలు చేసేవారు. మన రాష్ట్రంలో జరిగే అంశాలను చూపెడుతూ జనాలకి రాజకీయంపై అవగాహన కలిగిస్తూ సాగేవి. అయితే ఇప్పుడు అలాంటి సినిమాలు తగ్గిపోయాయి. అయితే ఎలక్షన్స్ దగ్గరపడుతున్న సమయంలో మళ్లీ ఆ హవా స్టార్టైంది. ఈ నేపథ్యంలో రిలీజైన ఈ సినిమా జనాల మూడ్ ని ప్రతిబింబిస్తూ సాగిందా లేక ‘నోటా’గురించి చర్చించిందా ఈ రివ్యూలో చూద్దాం.
కథేంటి
వరుణ్ (విజయ్ దేవరకొండ) అవినీతికి పేరు పడ్డ ముఖ్యమంత్రి వాసుదేవ్(నాజర్) కొడుకు. తండ్రి సంగతి తెలిసో..తెలియదో గానీ ఈ యంగ్ బోయ్ కు రాజకీయాలంటే అసలు గిట్టదు. తను రాజకీయాల్లో రాణించడు అని మనసా,వాచా నమ్మి తన తండ్రి పేరుని కూడా ఎక్కడా చెప్పడానికి ఇష్టపడడు. అయితే జీవితంలో మనమేది వద్దునుకుంటామో అదే దగ్గరకి తీసుకువచ్చి అందిస్తుంది. వరుణ్ పరిస్దితి కూడా అలాగే మారుతుంది. ఏదో సరదాగా లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ తన కెరీర్ ని గేమ్స్ డిజైన్స్ చేస్తూ బ్రతుకుదామనుకున్న అతన్ని ఓ రోజు ముఖ్యమంత్రి కుర్చీ వరిస్తుంది. తండ్రి ఓ అవినీతి కేసులో విచారణకు వెళ్లటంతో తప్పని సరి పరిస్దితుల్లో ఆలోచించటానికి కూడా టైమ్ లేని పరిస్దితుల్లో కుర్చీ ఎక్కుతాడు. అయితే ఆ తండ్రి..మొదటే వార్నింగ్ ఇస్తాడు..నువ్వు సొంతంగా ఏ నిర్ణయాలు తీసుకోకు..అంతా నేను చూసుకుంటాను అని..అలాగే అని వరుణ్ ..తన ఇంట్లో గేమ్స్ ఆడుకుంటూ కాలక్షేపం చేస్తాడు. అయితే ఈ లోగా ..కోర్టు ఆయనకు ఊహించని విధంగా శిక్ష ఖరారు చేస్తుంది. దాంతో రాష్ట్రంలో అల్లర్లు మొదలౌతాయి.
ఓ చిన్న పాప ఆ అల్లర్లులో మరణిస్తుంది. తన పార్టీ వాళ్లే తమ బలం చూపించటం కోసం అల్లర్లు మొదలు పెట్టారని తెలుసుకున్న వరుణ్ ...సీరియస్ గా రియాక్ట్ అవుతాడు. తన పార్టీ వాళ్లు అని కూడా చూడకుండా లోపల వేసేయమంటాడు. అతనికి మహేంద్ర (సత్యరాజ్) అనే సీనియర్ జర్నలిస్ట్ సాయిపడతాడు. ఈ లోగా తన తండ్రికు బెయిల్ వస్తుంది. దాంతో ఆయన తిరిగి ఇంటికి వస్తూండగా..ఆయనపై బాంబ్ దాడి జరిగి కోమాలోకి వెళ్తాడు. అసలు తన తండ్రిపై దాడి చేసిందెవరు..ఆ ప్రత్యర్దులు ఎవరు...వాళ్లు ఏం ఆశించి చేసారు..తన మీద, తమ కుటుంబం మీద కూడా దాడి చేస్తారా వంటి అనుమానాలు వస్తాయి వరుణ్ కు.
దాంతో వరుణ్ ఇన్విస్టిగేషన్ మొదలెడతాడు. కళ్లకు కనపడని శత్రువులతో గేమ్ ఆడటం మొదలెడతాడు. అక్కడ నుంచి అసలు తన తండ్రిని లేపాయాలనుకున్నది ఎవరు...అసలు తమ వెనుక జరుగుతున్న కుట్ర ఏమిటి...అనే విషయాలు బయటకు వస్తాయి. తండ్రిపై ఎటాక్ చేసిన వాళ్లు ఎవరు...వరుణ్ రాజకీయ జీవితం ఏమైంది...అసలు ఈ చిత్రానికి నోటా అనే టైటిల్ ఎందుకు పెట్టారు అనే విషయం తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎటు నుంచో ఎటో ప్రయాణం
లీడర్, భరత్ అనే నేను ..ఇప్పటికే వచ్చిన ఈ రెండు సినిమాలు.. ఊహించని విధంగా...తండ్రి చనిపోతే వచ్చి... ముఖ్యమంత్రి అయ్యి...రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లారు అనే పాయింట్ చుట్టూ తిరుగుతాయి. ఈ కథ కూడా అలాగే మొదలవుతుంది. కానీ ఊహించని విధంగా.. రకరకాల ట్విస్ట్ లు తీసుకుంటుంది. అసలు కథలోంచి కొసరు కథలోకి.. అక్కడనుంచి మరో చోటకు ప్రయాణం పెట్టుకుంటుంది. అదెలా అంటే..
ఈ సినిమా కథ ని వరుణ్ అనే కుర్రాడి రాజకీయ ప్రస్దానం గా మొదలెట్టి... తర్వాత ...ఆ విషయం ప్రక్కన పెట్టి అతని తండ్రి, మెంటర్ (సత్యరాజ్) ప్లాష్ బ్యాక్ లు చెప్పటం మొదలెడతాడు. అవి కూడా లవ్ స్టోరీలు. ఆ లవ్ స్టోరీలు చూస్తూంటే విరక్తి పుడుతుంది. అంత చెత్తగా ఉంటాయి. అలాగే ఈ కథలో హీరోకు లవ్ ట్రాక్ గానీ, రొమాంటిక్ ట్రాక్ గానీ ఉండదు. ఉండాలని రూల్ లేదు కానీ కాస్త రిలీఫ్ కోసమైనా పెట్టాల్సింది. ప్రీ క్లైమాక్స్ లో ...తన తల్లిని ప్రేమించిన ఇద్దరు ఎదురుగా కూర్చుని తమ ప్రేమ కథలు గురించి మాట్లాడుకుంటూంటే హీరో చూడాల్సి రావటం అనే సీన్ .. పరాకాష్టలా ఉంటుంది. డైజస్ట్ కాదు.
క్లైమాక్స్ లేదు..
నిజానికి ఈ సినిమా ద్వారా డైరక్టర్ ఏమి చెప్పదలుచుకున్నాడో పొరపాటున కూడా అర్దం కాదు. సినిమాలో ఎవరు విలనో తెలిసే సరికే ప్రీ క్లైమాక్స్ కు వచ్చేస్తుంది. ఆ విలన్ ని కూడా హీరో దెబ్బకొట్టడం చూపించరు. మనమే అర్దం చేసుకోవాలి. అలాగే ఈ కథలో పెద్ద లోపం.. సినిమా మొత్తాన్ని నిలబెట్టే క్లైమాక్స్ అసలు లేదు. అర్దాంతరంగా ముగించేసారు.
తమిళరాజకీయాలను
జయలలిత మృతి అనంతంరం జరిగిన తమిళ రాజకీయ పరిణామాలను చూపించాలని దర్శకుడు తాపత్రయపడ్డారు. వాటినే చూపించి హిట్ కొట్టాలనుకున్నాడు. అయితే ఆ రాజకీయాలు తెలుగువాళ్లకు ఎక్కడ అర్దం అవుతాయి?
ఎవరెలా చేశారు
ఈ సినిమాలో ఎప్పటిలాగే విజయ్ దేవరకొండ బాగానే సహజంగా నటించారు. తన ఎక్సప్రెషన్స్ తో చాలా సీన్లలో విషయం లేకపోయినా ప్రయత్నం చేసాడు. నాజర్, సత్యరాజ్ వంటి సీనియర్స్ ఎప్పటిలాగే చేసుకుంటూ పోయారు. కాకపోతే సెకండాఫ్ లో నాజర్ మేకప్ చూస్తూంటే వికారం పుడుతుంది. అలా చేశారు. ప్రియదర్శి నుంచి ఎంతో ఎక్సపెక్ట్ చేస్తాం గానీ ఆయన తరహా కామెడీ సినిమాలో అసలు లేదు. తమిళ నటుడు ఎమ్.ఎస్ భాస్కర్ మాత్రం చాలా బాగా చేసారు.
హీరోయిన్ ఏది
ఈ సినిమాలో హీరోయిన్ ఎవరో చెప్పితే వాళ్లకు గిప్ట్ ఇవ్వచ్చు.. అలా డిజైన్ చేసారు మెహ్రీన్ పాత్రను.
పాటలు లేవు
హీరో ఇంట్రడక్షన్ సాంగ్ తప్ప సినిమాలో పాటలు లేవు. అయితే ఇలాంటి పొలిటికల్ థ్రిల్లర్ సినిమాల నుంచి ఎక్సపెక్ట్ కూడా చేయలేం. అలాగే కామెడీ సీన్స్ కూడా రిలీఫ్ కు పెట్టలేదు.
అర్దం లేని టైటిల్
ఈ సినిమాకు నోటా అనే టైటిల్ ఎందుకు పెట్టారో .. దర్శకనిర్మాతలకే తెలియాలి. లేదా విజయదేవరకొండ చెప్పాలి. ఒక్కటంటే ఒక్క సీన్ కూడా ఆ టైటిల్ ని జస్టిఫై చేసేటట్లు లేదు. సౌండ్ బాగుందని పెట్టేసినట్లున్నారు.
మురగదాస్ గెస్ట్ రోల్ ఏంటంటే
సినిమాలో ప్రముఖ దర్శకుడు మురగదాస్ కొద్ది సేపు కనపడ్డారు. ఆయన సినిమా డైరక్టర్ గానే కనపడతారు. అయితే ఆయన కనపడటం వల్ల కథలో పెద్ద మార్పేమీ ఉండదు. ఏదో తమిళ మార్కెట్ లో క్రేజ్ కోసం పెట్టినట్లుంది.
టెక్నికల్ గా...
సినిమాలో యస్.కృష్ణ రవిచంద్రన్ సినిమాటోగ్రఫీ హైలెట్ అని చెప్పాలి. ఎడిటింగ్ చేసిన తీరు కూడా ఈ సినిమా కు బాగా ప్లస్ అయ్యింది. అయితే కొన్ని సీన్స్ కావాలనే లాగ్ గా వదిలేసారు. వాటిని ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది. ఇక తెలుగు డబ్బింగ్ డైలాగులు అద్బుతం కాదు కానీ జస్ట్ ఓకే. నిర్మాత జ్ఞానవేల్ రాజా ఆయన స్దాయికి తగ్గట్లే సినిమాని మలిచారు.
ఫైనల్ ధాట్
టైటిల్ పెట్టడంలో ఉన్న క్రియేటివిటి సినిమాలో కొంచెమైనా చూపిస్తే బాగుండేది.
రేటింగ్ : 2 / 5
సంబంధిత వార్తలు
రాజకీయం తుస్సు: నోటాకు అంత సీన్ లేదు
విజయ్ దేవరకొండ 'నోటా'.. ప్రశంసలతో పాటు విమర్శలు!
కేటీఆర్ లుక్స్ ని మక్కీ మక్కీ దింపా: నోటా సినిమాపై విజయ్ దేవరకొండ
విజయ్ దేవరకొండ 'నోటా' టార్గెట్ ఎంతంటే..?
రష్మిక బ్రేకప్ పై విజయ్ దేవరకొండకి ఊహించని ప్రశ్న!