Asianet News TeluguAsianet News Telugu

'నోటా' ట్విట్టర్ టాక్..!

విజయ్ దేవరకొండ హీరోగా వరుస విజయాలు అందుకుంటూ టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు. తాజాగా 'నోటా' చిత్రంతో తమిళ ప్రేక్షకులకు కూడా దగ్గరవ్వడానికి ప్రయత్నిస్తున్నాడు. దర్శకుడు ఆనంద్ శంకర్ డైరెక్ట్ చేసిన 'నోటా' సినిమా ఈరోజు తెలుగు, తమిళ భాషల్లో విడుదలైంది. 

vijay devarakonda nota movie twitter talk
Author
Hyderabad, First Published Oct 5, 2018, 9:22 AM IST

విజయ్ దేవరకొండ హీరోగా వరుస విజయాలు అందుకుంటూ టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు. తాజాగా 'నోటా' చిత్రంతో తమిళ ప్రేక్షకులకు కూడా దగ్గరవ్వడానికి ప్రయత్నిస్తున్నాడు. దర్శకుడు ఆనంద్ శంకర్ డైరెక్ట్ చేసిన 'నోటా' సినిమా ఈరోజు తెలుగు, తమిళ భాషల్లో విడుదలైంది. 

విడుదలకు ముందు నుండి ఈ సినిమా ఏదోక వివాదంతో వార్తల్లో నిలుస్తూనే ఉంది. టైటిలే అభ్యంతరకంగా ఉందని రాజకీయ నాయకులు ఈ సినిమాపై మండిపడ్డారు. తెలంగాణా ఎన్నికల నేపధ్యంలో ప్రేక్షకుల ముందుకు వస్తోన్న ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు తొలగించాలని కోర్టు వరకు కూడా వెళ్లారు.

మొత్తానికి ఈ వివాదాల నడుమ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఓవర్సీస్ లో సినిమా ప్రీమియర్ షోలు ప్రదర్శింపబడ్డాయి. అక్కడి ప్రేక్షకులు ట్విట్టర్ ద్వారా సినిమాపై తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. చాలా మంది సినిమా ఫస్ట్ హాఫ్ బాగుంది కానీ సెకండ్ హాఫ్ విసిగించిందని,ముఖ్యంగా పాటలు మరింత బోర్ కొట్టించాయని అంటున్నారు.

తెలుగు ప్రేక్షకులకు ఓ డబ్బింగ్ సినిమా చూస్తున్న ఫీలింగ్ కలుగుతోందని ట్వీట్లు చేస్తున్నారు. సినిమాలో ప్రెస్ మీట్ సన్నివేశాలు హైలైట్ గా నిలిచాయని, అయితే సెకండ్ హాఫ్ లో కూడా జోరు చూపించి ఉంటే మంచి విజయాన్ని అందుకొని ఉండేదని చెబుతున్నారు. సినిమాలో విజయ్ దేవరకొండ నటనకి మాత్రం మంచి మార్కులు వేస్తున్నారు. ఒక్కసారి సినిమా చూసే ప్రయత్నం చేయోచ్చంటూ తేల్చేస్తున్నారు. 

ఇవి కూడా చదవండి..

కేటీఆర్ లుక్స్ ని మక్కీ మక్కీ దింపా: నోటా సినిమాపై విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ 'నోటా' టార్గెట్ ఎంతంటే..?

రష్మిక బ్రేకప్ పై విజయ్ దేవరకొండకి ఊహించని ప్రశ్న!

టాలీవుడ్ వారసత్వంపై విజయ్ దేవరకొండ కామెంట్స్!

నోటాపై విమర్శలు.. విజయ్ దేవరకొండ సౌండ్ లేదేంటి?

రెమ్యునరేషన్ గురించి విజయ్ దేవరకొండ మాటల్లో!

'నోటా' టీఆర్ఎస్ కి సపోర్టా..?

Follow Us:
Download App:
  • android
  • ios