Asianet News TeluguAsianet News Telugu

'నోటా' ఫస్ట్ డే కలెక్షన్స్!

విజయ్ దేవరకొండ నటించిన 'నోటా' సినిమా శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకి ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన లభిస్తోంది. ఓవర్సీస్ ప్రేక్షకుల నుండి మాత్రం ఈ సినిమాపై నెగెటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. 

nota movie premier shows collections
Author
Hyderabad, First Published Oct 5, 2018, 9:29 PM IST

విజయ్ దేవరకొండ నటించిన 'నోటా' సినిమా శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకి ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన లభిస్తోంది. ఓవర్సీస్ 
ప్రేక్షకుల నుండి మాత్రం ఈ సినిమాపై నెగెటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి.

అక్కడ దాదాపు 220 కి పైగా స్క్రీన్ లలో ప్రీమియర్ షోలను ప్రదర్శించారు. విజయ్ కెరీర్ లో ఇదొక రికార్డ్ అనే చెప్పాలి. అయితే ఆశించిన స్థాయిలో సినిమా వసూళ్లను మాత్రం సాధించలేకపోయింది. తెలుగు, తమిళ వెర్షన్స్ కలిపి లక్ష ఎనభై వేల డాలర్లను రాబట్టింది.

విజయ్ గత చిత్రం 'గీత గోవిందం' 158 స్క్రీన్ లలో ప్రదర్శిస్తే 4 లక్షల డాలర్లను వసూలు చేసింది. ఆ లెక్కన చూసుకుంటే 'నోటా'.. గీత గోవిందం లో సగం వసూళ్లను కూడా రాబట్టలేకపోయింది.

నిజానికి ఈ సినిమా వివాదాల నడుమ విడుదలై కావల్సినంత పబ్లిసిటీని దక్కించుకుంది. కానీ పోలిటికల్ డ్రామాలో ఉండాల్సిన ఎత్తుకి, పైఎత్తులు.. డ్రామా ఈ సినిమాలో మిస్ అయిందని ఆ కారణంగానే సినిమాపై నెగెటివ్ కామెంట్లు వస్తున్నాయని తెలుస్తోంది. 

ఇవి కూడా చదవండి..

టాటా...( ‘నోటా‌’ మూవీ రివ్యూ )

'నోటా' ట్విట్టర్ టాక్.. అభిమానుల పెదవి విరుపులు!

కేటీఆర్ లుక్స్ ని మక్కీ మక్కీ దింపా: నోటా సినిమాపై విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ 'నోటా' టార్గెట్ ఎంతంటే..?

రష్మిక బ్రేకప్ పై విజయ్ దేవరకొండకి ఊహించని ప్రశ్న!

టాలీవుడ్ వారసత్వంపై విజయ్ దేవరకొండ కామెంట్స్!

Follow Us:
Download App:
  • android
  • ios