యంగ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ నటించిన 'నోటా' సినిమా మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈరోజు ఓవర్సీస్ లో సినిమా ప్రీమియర్ షోలు పడనున్నాయి. ఆనంద్ శంకర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా పూర్తిగా రాజకీయ నేపధ్యంలో తెరకెక్కింది. 

యంగ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ నటించిన 'నోటా' సినిమా మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈరోజు ఓవర్సీస్ లో సినిమా ప్రీమియర్ షోలు పడనున్నాయి. ఆనంద్ శంకర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా పూర్తిగా రాజకీయ నేపధ్యంలో తెరకెక్కింది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఇప్పటికే విడుదలైన సినిమా పోస్టర్లు, ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచేశాయి. దీంతో విజయ్ దేవరకొండకి మరో బ్లాక్ బస్టర్ హిట్ ఖాయమనే మాటలు వినిపిస్తున్నాయి. 'గీత గోవిందం' సినిమాతో అరవై కోట్ల షేర్ వసూలు చేసిన విజయ్ దేవరకొండ ఈ సినిమాతో ఎంత సాధిస్తాడనే విషయం ఆసక్తిగా మారింది. 

బయ్యర్లు కూడా విజయ్ దేవరకొండ మీద ఉన్న నమ్మకంతో భారీ మొత్తంలో చెల్లించి థియేట్రికల్ రైట్స్ ని దక్కించుకున్నారు. ఏపీ, తెలంగాణా రెండు రాష్ట్రాల్లో కలిపి ఈ సినిమాను రూ.19 కోట్లకు అమ్మినట్లు తెలుస్తోంది. కర్ణాటక, తమిళనాడు(తెలుగు వెర్షన్), ఉత్తరాదిన మరో రెండున్నర కోట్ల బిజినెస్ చేసింది.

ఓవర్సీస్ లో ఈ సినిమా హక్కులు రూ.3.5 కోట్లకు అమ్మారు. మొత్తంగా చూసుకుంటే ప్రీరిలీజ్ బిజినెస్ ద్వారా రూ.25 కోట్లు రాబట్టారు. అంతకు మించి సినిమా వసూలు చేస్తేనే బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు లాభాల బాట పడతారు. మరి 'నోటా' ఆ టార్గెట్ ని ఎంతవరకు రీచ్ అవుతుందో చూడాలి!

ఇవి కూడా చదవండి..

రష్మిక బ్రేకప్ పై విజయ్ దేవరకొండకి ఊహించని ప్రశ్న!

టాలీవుడ్ వారసత్వంపై విజయ్ దేవరకొండ కామెంట్స్!

సినిమా రిలీజ్ ఆపడానికి చాలా చేస్తున్నారు.. విజయ్ దేవరకొండ సంచలన వ్యాఖ్యలు!

నోటాపై విమర్శలు.. విజయ్ దేవరకొండ సౌండ్ లేదేంటి?

రెమ్యునరేషన్ గురించి విజయ్ దేవరకొండ మాటల్లో!

'నోటా' టీఆర్ఎస్ కి సపోర్టా..?