నటుడిగా కెరీర్ మొదలుపెట్టి చాలా కాలం అవుతున్నా.. 'పెళ్లిచూపులు' సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. ఆ తరువాత విడుదలైన 'అర్జున్ రెడ్డి'తో ఓవర్ నైట్ లో స్టార్ హోదా దక్కించుకున్నాడు. ఇక ఇటీవల విడుదలైన 'గీత గోవిందం' సినిమా రూ.100 కోట్ల మార్క్ ను చేరుకుందని మేకర్స్ చెబుతున్నారు. ఈ రేంజ్ లో టాలీవుడ్ లో క్రేజ్ దక్కించుకున్న ఈ యంగ్ హీరో ప్రస్తుతం 'నోటా','టాక్సీవాలా' వంటి సినిమాల్లో నటిస్తున్నాడు.

త్వరలోనే ఈ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఇవి కాకుండా మరో అరడజను సినిమాలు అతడి చేతిలో ఉన్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయ్ కి.. ఇప్పటికీ మీ స్నేహితులు మీతో ఎప్పటిలానే ఉంటారా..? లేక మీరు స్టార్ అయ్యారు కాబట్టి వారి ధోరణిలో ఏమైనా మార్పొచ్చిందా..? వంటి ప్రశ్నలు ఎదురయ్యాయి. దీనికి సమాధానంగా..

''నా ఫ్రెండ్స్ ఆలా అనుకుంటే బాగానే ఉండేది కానీ అలా అనుకోరు. నాతో బయటకి రావడానికి ఇబ్బంది పడతారు కానీ ఇంటికి వచ్చేస్తుంటారు. చిన్నప్పటి నుండి మేం మంచి స్నేహితులం కావడంతో ఇప్పటికీ వాళ్లు నన్ను ఆటపట్టిస్తూనే ఉంటారు. మేమంతా కలుసుకున్నప్పుడు లైఫ్, కెరీర్ ఇలాంటి సీరియస్ వ్యవహారాలు డిస్కస్ చేసుకోము. సరదాగా గేమ్స్ ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తుంటాం. ఒక్క మాటలో చెప్పాలంటే చిల్లపనులు, టైమ్ వేస్ట్ పనులే ఎక్కువ'' అంటూ వెల్లడించారు. 

ఇవి కూడా చదవండి.. 

'గీత గోవిందం' అడ్వాంటేజ్ 'నోటా' తీసుకుంటుందా..?

'గీత గోవిందం' నా సినిమాకి కాపీ.. ప్రముఖ దర్శకుడు!

అప్పుడు కూడా విజయ్ దేవరకొండని స్టార్ అంటారా..? నాగశౌర్య కామెంట్స్!

విజయ్ దేవరకొండ రెమ్యునరేషన్ తో కుర్రహీరోలు షాక్!