'గీత గోవిందం' అడ్వాంటేజ్ 'నోటా' తీసుకుంటుందా..?

https://static.asianetnews.com/images/authors/74ce1d03-f84b-5b8e-abc1-c43c5f7c8632.jpg
First Published 28, Aug 2018, 3:03 PM IST
vijay devarakonda will have one more release before taxiwaala
Highlights

విజయ్ దేవరకొండ నటించిన 'గీత గోవిందం' సినిమా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా విజయ్ రేంజ్ మరింత పెరిగిపోయింది. 'గీత గోవిందం' సినిమాను నిర్మించిన అల్లు అరవింద్ క్యాంపే విజయ్ దేవరకొండతో 'టాక్సీవాలా' అనే మరో సినిమాను నిర్మించింది

విజయ్ దేవరకొండ నటించిన 'గీత గోవిందం' సినిమా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా విజయ్ రేంజ్ మరింత పెరిగిపోయింది. 'గీత గోవిందం' సినిమాను నిర్మించిన అల్లు అరవింద్ క్యాంపే విజయ్ దేవరకొండతో 'టాక్సీవాలా' అనే మరో సినిమాను నిర్మించింది. నిజానికి ముందుగా ప్రేక్షకుల ముందుకు రావాల్సిన సినిమా 'టాక్సీవాలా'. కానీ విఎఫ్ఎక్స్ పనుల కారణంగా ముందుగా 'గీత గోవిందం' సినిమాను విడుదల చేశారు.

ఈ సినిమా ఇచ్చిన సక్సెస్ 'టాక్సీవాలా' సినిమాకు అడ్వాంటేజ్ అవుతుందని అనుకున్నారు. ఓపెనింగ్స్ కూడా భారీ స్థాయిలో వచ్చే అవకాశాలు ఉన్నాయి. సొంతంగా రిలీజ్ చేసుకున్నా.. ఎలాంటి రిస్క్ ఉండదు. నిర్మాతలు కూడా ఇదే ప్లాన్ చేశారు. కానీ ఇప్పుడు 'గీత గోవిందం' అడ్వాంటేజ్ ను 'నోటా' సినిమా తీసుకోబోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిస్తోన్న ఈ సినిమాను ఆనంద్ శంకర్ డైరెక్ట్ చేస్తున్నారు.

రెండు భాషల్లో క్రిస్మస్ కానుకగా సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే అప్పటికి 'టాక్సీవాలా' పనులు అవుతాయో లేదో చెప్పలేని పరిస్థితి. దీంతో దానికంటే ముందుగా 'నోటా' సినిమా విడుదలవుతుందని అంటున్నారు. అదే గనుక జరిగితే 'గీత గోవిందం' అడ్వాంటేజ్ 'నోటా'కి దక్కుతుందనే చెప్పాలి. ఈ సినిమా కూడా హిట్ అయిపోతే 'టాక్సీవాలా'కి మరింత క్రేజ్ వచ్చేస్తుంది. 

ఇది కూడా చదవండి.. 

'గీత గోవిందం' నా సినిమాకి కాపీ.. ప్రముఖ దర్శకుడు!

loader