టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోగా మారిపోయాడు విజయ్ దేవరకొండ. వరుస విజయాలు అతడిని టాప్ రేసులో కూర్చోపెట్టాయి. రూ.14 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన 'గీత గోవిందం' సినిమా విజయ్ కి ఉన్న క్రేజ్ తో రూ.60 కోట్ల షేర్ ని సాధించింది. విజయ్ ఫాలోయింగ్ చూసి కుర్రహీరోలకి మతి పోతుందనే చెప్పాలి. ఇప్పటికే విజయ్ సక్సెస్ లిస్ట్ తో చాలా మంది ఆలోచనలో పడ్డారు. ఇప్పుడు వారికి మరో షాక్ ఇచ్చాడు విజయ్ దేవరకొండ.

'గీత గోవిందం' విడుదల కాకముందు మైత్రి మూవీ మేకర్స్ లో రెండు సినిమాలకు సైన్ చేశాడు విజయ్ దేవరకొండ. ఒక్కో సినిమాకు రూ.3 కోట్ల రెమ్యునరేషన్ చొప్పున వారితో డీల్ కుదుర్చుకున్నాడు. ఈ రెండు సినిమాలే కాకుండా.. క్రియేటివ్ కమర్షియల్స్ తో ఓ సినిమా అలానే గీతాఆర్ట్స్-యువి క్రియేషన్స్ జాయింట్ వెంచర్ లో మరో సినిమా చేయడానికి కమిట్మెంట్ ఇచ్చాడు.

ఇది ఇలా ఉండగా.. ఆల్రెడీ డీల్ కుదుర్చుకున్న మైత్రి మూవీ మేకర్స్ వారు ఇప్పుడు విజయ్ కి రెమ్యునరేషన్ పెంచి రూ.8 కోట్ల చొప్పున ఒక్కో సినిమాకు ఇవ్వబోతున్నట్లు సమాచారం. నిజానికి డీల్ పూర్తయిన రెమ్యునరేషన్ పెంచాల్సిన అవసరం లేకపోయినా.. తమ బ్యానర్ లో పని చేసే హీరోలతో మంచి రిలేషన్ మైంటైన్ చేయాలనే ఉద్దేశంతో ప్రస్తుతం విజయ్ కి ఉన్న మార్కెట్ ను బట్టి ఈ రేంజ్ లో పారితోషికం ఇస్తున్నట్లు తెలుస్తోంది.

నిజానికి ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోల్లో శర్వానంద్, నాని టాప్ రేసులో ఉన్నారు. నాని కూడా ఒక్కో సినిమాకు రూ.6 కోట్లు మాత్రమే తీసుకుంటాడు. కానీ విజయ్ కి రూ.8 కోట్లు రెమ్యునరేషన్ కి రీచ్ అవ్వడం విశేషమనే చెప్పాలి. ఇదే సక్సెస్ బాట కొనసాగిస్తే.. స్టార్ హీరోల జాబితాలోకి చేరడం ఖాయమనిపిస్తుంది!

ఇవి కూడా చదవండి.. 

'గీత గోవిందం' అడ్వాంటేజ్ 'నోటా' తీసుకుంటుందా..?

'గీత గోవిందం' నా సినిమాకి కాపీ.. ప్రముఖ దర్శకుడు!