ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు 'గీత గోవిందం' సినిమా తన సినిమా నుండి కాపీ కొట్టి తీసినట్లు చెబుతున్నాడు. అసలు విషయంలోకి వెళ్తే.. తాజాగా హైదరాబాద్ లో సంతోషం అవార్డుల ప్రధానోత్సవం జరిగింది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ చిత్రాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి వివిధ కేటగిరీలలో అవార్డులు అందించారు. అంగరంగ వైభవంగా జరిగిన ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి, ఎస్.జానకి, దర్శకుడు రాఘవేంద్రరావు, నిర్మాత అల్లు అరవింద్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

అయితే ఈ సందర్భంగా 'గీత గోవిందం' సినిమాపై ప్రశంసలు కురిపించిన దర్శకుడు రాఘవేంద్రరావు.. ఈ సినిమా తన పెళ్లి సందడి సినిమాకు కాపీ అని అన్నారు. మరిన్ని విషయాలను చెబుతూ.. ''ఇరవై ఏళ్ల క్రితం నేను, అరవింద్ కలిసి 'పెళ్లి సందడి' సినిమా తీశాం. రీసెంట్ గా విడుదలైన 'గీత గోవిందం' సినిమా ఆ సినిమాను గుర్తు చేసింది. దర్శకుడు పరశురామ్ నా సినిమాను కాపీ కొట్టాడు. ఒక ముద్దు సీన్ కూడా లేకుండా సినిమా చేయడమంటే చాలా కష్టం.

నిర్మాతల దగ్గర నుండి చాలా ఒత్తిళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అవే పరశురామ్ కూడా ఎదుర్కొని ఉంటాడు. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమా చేసినందుకు సంతోషంగా ఉంది'' అంటూ చెప్పుకొచ్చాడు.  

ఇది కూడా చదవండి.. 

రూ.60 కోట్ల దిశగా 'గీత గోవిందం' పరుగులు!

హరికృష్ణ మృతి మా కుటుంబానికి తీరని లోటు...సీఎం చంద్రబాబు

హరికృష్ణ కార్ యాక్సిడెంట్.. ప్రత్యక్ష సాక్షి ఏమన్నారంటే..

ఆ విషయం ఎన్టీఆర్ తర్వాత.. హరికృష్ణకు మాత్రమే తెలుసట