నేచులర్‌ స్టార్ నాని, మ్యాన్లీ హంక్ సుధీర్ బాబు హీరోలుగా తెరకెక్కిన తాజా చిత్రం `వి`. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ థ్రిల్లర్‌ మూవీ సెప్టెంబర్‌ 5న అమెజాన్‌ ప్రైమ్‌లో రిలీజ్ అయ్యింది. లాక్‌ డౌన్‌ తరువాత రిలీజ్ అయిన తొలి స్టార్‌ హీరోల సినిమా, ఓటీటీలో రిలీజ్ తొలి బిగ్ మూవీ కావటంతో వి పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. నాని తొలిసారిగా పూర్తి నెగెటివ్‌ రోల్‌లో నటించటం కూడా ఈ సినిమాపై హైప్‌కు కారణమైంది.

సినిమాలో హీరోగా నటించిన సుధీర్‌ బాబు లుక్‌, పర్ఫామెన్స్‌లకు మంచి రెస్పాన్స్‌ వస్తోంది. ముఖ్యంగా ఫస్ట్‌ ఫైట్‌లో సుధీర్‌ హాలీవుడ్‌ హీరోల కనిపించాడంటున్నారు ఫ్యాన్స్. అదే సమయంలో ఓ సిన్సియర్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా అద్భుతంగా నటించాడు. నాని లాంటి నేచులర్‌ యాక్టర్‌కు నటన పరంగా కూడా గట్టి పోటి ఇచ్చాడు సుధీర్ బాబు. ఇటీవల దర్శకుడు ఇంద్రగంటి మోహన కృష్ణ కూడా సుధీర్ పర్ఫామెన్స్‌ గురించి ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశాడు.

సుధీర్ బాబు అద్భుతమైన నటుడన్న మోహనకృష్ణ, ఆయనకు అసలు ఓవర్‌ యాక్టింగ్ చేయటం రాదంటూ కితాబిచ్చాడు. తెలుగు ఇండస్ట్రీలో సుధీర్ రేంజ్‌కు తగ్గ పాత్రలు దక్కటం లేదని, ఇక మీదటైన ఆయన పర్ఫామెన్స్‌, లుక్‌కు తగ్గ స్థాయి కథలు వస్తాయని భావిస్తున్నా అన్నాడు.