మెగా ఫ్యామిలీలో విషాదం నెలకొంది. మెగా కోడలు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ సతీమణి ఉపాసన తాతయ్య కామినేని ఉమాపతి రావు ఈ రోజు (బుధవారం) కన్నుమూశారు. చాలా కాలంగా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న ఆయన ఈ బుధవారం ఉదయం తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా ద్వారా ఫాలోవర్స్‌తో షేర్ చేసుకున్న ఉపాసన ఆయన ఆత్మకు శాంతి చేకూరలని ప్రార్థించింది. `తాతయ్య కే ఉమాపతి రావు (15 జూన్‌, 1928 - 27 మే, 2020) గొప్ప విలువలతో పాటు నిస్వార్థం, మానవాతా భావాలు, సెన్సాఫ్‌ హ్యూమర్‌ కలిగిన వ్యక్తి.

ఉర్దూ రచయిత అయిన ఆయన తన ష్యెహరీల ద్వారా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం తొలి ఈవోగా పనిచేసిన ఆధ్యాత్మిక భావాలు ఉన్న వ్యక్తి. ఎన్నో సేవా కార్యక్రమాల్లోనూ ఆయన పాల్గొన్నారు అంటూ భావోద్వేగంగా ట్వీట్ చేశారు ఉపాసన. ఉమ్మడి నిజమాబాద్ జిల్లాలోని దోమకొండ ప్రాంతానికి చెందిన ఉమాపతిరావు అప్పట్లోనే ఐఏఎస్‌ ఆఫీసర్‌గా పనిచేశారు. ఎన్నో రంగాల్లో విశేష సేవలందించిన ఆయన టీటీడీలోనూ కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. ఆయన మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.