Asianet News TeluguAsianet News Telugu

త్రివిక్రమ్ ముందస్తు చర్య..ఆమెనే కావాలట?

 హీరోయిన్ విషయంలో త్రివిక్రమ్ ఒక నిర్ణయానికి వచ్చాడంటే అందులో మార్పులుండవ్ అని ఓ టాక్ ఉంది. రీసెంట్ గా బన్నీ కోసం ఒక కాన్సప్ట్ ను సెట్ చేసిన మాటల మాంత్రికుడు దాదాపు ఆ కథను ఎండ్ చేసే స్టేజ్ కి వచ్చేశాడు. 

trivikram bunny project in kiara adwani
Author
Hyderabad, First Published Jan 1, 2019, 6:17 PM IST

ఒక కాన్సెప్థ్ అనుకున్నవెంటనే ఆ కథకు సరిపడే హీరో మైండ్ కి తగిలితే దర్శకులు వెంటనే వెళ్లి హీరోల డేట్స్ తీసుకుంటారు. ఇప్పుడు హీరోయిన్స్ విషయంలో కూడా చాలా వరకు అదే తరహాలో అడుగులు వేస్తున్నారు. ముఖ్యంగా స్టార్ హీరోయిన్స్ డేట్స్ దొరకడం కష్టంగా మారుతోంది. అయితే హీరోయిన్ విషయంలో త్రివిక్రమ్ ఒక నిర్ణయానికి వచ్చాడంటే అందులో మార్పులుండవ్ అని ఓ టాక్ ఉంది. 

రీసెంట్ గా బన్నీ కోసం ఒక కాన్సప్ట్ ను సెట్ చేసిన మాటల మాంత్రికుడు దాదాపు ఆ కథను ఎండ్ చేసే స్టేజ్ కి వచ్చేశాడు. అయితే పనిలో పనిగా ముందుగానే హీరోయిన్ విషయంలో కూడా స్టార్ డైరెక్టర్ ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. మహేష్ - భరత్ అనే నేను సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన బాలీవుడ్ సుందరి కైరా అద్వానీని బన్నీకి ఫిక్స్ చేయాలనీ నిర్మాతలకు ముందే చెప్పారట. 

స్టార్ డమ్ ప్లస్ క్యూట్ నెస్ తో అలరించే కైరాను త్రివిక్రమ్ తనదైన శైలిలో తెరపై ప్రజెంట్ చేస్తాడట. త్రివిక్రమ్ సినిమాల్లో హీరోయిన్స్ కి ప్రదాన్యత ఎంతలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక కైరా కూడా ఈ ప్రాజెక్ట్ కి నో చెప్పే అవకాశం కూడా లేదు. నిర్మాతలు ఇతర హీరోయిన్స్ ను చూస్తున్నప్పటికి త్రివిక్రమ్ మాత్రం కైరాపై మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. మరి వీరి కాంబో ఎప్పుడు తెరపైకి వస్తుందో చూడాలి. 

Follow Us:
Download App:
  • android
  • ios