అనిరుద్ తప్పుకోవడానికి కారణమిదే.. క్లారిటీ ఇచ్చిన త్రివిక్రమ్!

First Published 11, Oct 2018, 4:00 PM IST
trivikram about anirudh replace
Highlights

ఎన్టీఆర్ కథానాయకుడిగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన చిత్రం అరవింద సమేత. భారీ స్థాయిలో నేడు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూలు అందాయి. సినిమాకు క్రేజ్ తేవడానికి చిత్ర యూనిట్ స్పెషల్ గా ప్లాన్ అయితే ఏమి చేయలేదు. కేవలం సినిమాకు సంబందించిన మీడియా సమావేశాల్లో మాత్రమే పాల్గొంది.

త్రివిక్రమ్ ఎన్టీఆర్ కాంబినేషన్ ఒక్కటే సినిమాకు భారీ ప్రమోషన్స్ అని చెప్పాలి. అసలు మ్యాటర్ లోకి వెళితే.. సినిమాకు మొదట కోలీవుడ్ యువ సంగీత దర్శకుడు అనిరుద్ అని అనుకున్న సంగతి తెలిసిందే. అయితే సడన్ అతను తప్పుకోవడంతో ఒక్కసారిగా రూమర్స్ వచ్చాయి. అజ్ఞాతవాసి రిజల్ట్ ప్రబావమని చాలా మంది అనుకున్నారు. 

ఫైనల్ గా త్రివిక్రమ్ ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆ విషయంపై క్లారిటీ ఇచ్చాడు. త్రివిక్రమ్ మాట్లాడుతూ.. అజ్ఞాతవాసి తరువాత అనిరుద్ ని నెక్స్ట్ సినిమాకు తీసుకోవాలని అనుకున్నా. ఆ తరువాత అలోచించి అరవింద సమేతకు అనిరుద్ కరెక్ట్ ఛాయిస్ కాదని ఈ విషయం అతనికి చెప్పను. 

ఇంకా తెలుగు మ్యూజిక్ ను మీరు చాలా అర్ధం చేసుకోవాలని అన్నా. అలాగే అతని మ్యూజిక్ గురించి కూడా నేను తెలుసుకోవడానికి సమయం తీయసుకోవాలని అనుకోని వెంటనే ఈ చిత్రానికి థమన్ ని తీసుకున్నట్లు చెప్పారు. అయితే భవిష్యత్తులో తప్పకుండా అనిరుద్ తో సినిమా చేస్తానని త్రివిక్రమ్ తెలిపారు. 

సంబంధిత వార్తలు

అభినయ సమేత...('అరవింద సమేత' రివ్యూ)

తారక్ తగ్గట్లేదుగా.. యూఎస్ లో రికార్డ్ కలెక్షన్స్!

యూఎస్ ప్రీమియర్ షో టాక్: అరవింద సమేత

ట్విట్టర్ రివ్యూ: అరవింద సమేత

'అరవింద సమేత' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది..!

అరవింద సమేత కోసం స్పెషల్ హాలిడే ఇచ్చేశారు!

‘అరవింద సమేత’విడుదల.. టీడీపీ, వైసీపీ గొడవ

loader