డ్రగ్స్ ఆరోపణల నేపథ్యంలో బాలీవుడ్ హీరోయిన్స్ దీపికా పదుకొనె, శ్రద్దా కపూర్, సారా అలీఖాన్ మరియు రకుల్ ప్రీత్ సింగ్ విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. మొదటిగా హీరోయిన్ రకుల్ ప్రీత్ ని నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు విచారించారు. ఆ తరువాత దీపికా పదుకొనె, శ్రద్దా కపూర్ మరియు సారా అలీ ఖాన్ లను కూడా అధికారులు విచారించడం జరిగింది. ఈ విచారణలో ఈ ముగ్గురు హీరోయిన్స్ కీలక సమాచారం భయటపెట్టినట్లు తెలుస్తుంది. 

రకుల్ ప్రీత్ రియా చక్రవర్తితో డ్రగ్స్ గురించి మాట్లాడినట్లు, ఐతే వాటిని కొనడం కానీ...వినియోగించడం కానీ చేయలేదని చెప్పినట్లు సమాచారం. ఈ నలుగురు హీరోయిన్స్ విచారణలో చెప్పిన విషయాలు ఒకేలా ఉన్నాయని అధికారులు అంటున్నారు. హ్యాష్ అనే ఓ డ్రగ్ గురించి వీరు ప్రస్తావించినట్లు సమాచారం అందుతుంది. 

హ్యాష్ అనేది మాదకద్రవ్యం కాదని, అది మత్తు కలిగించదని దీపిక, సారా, రకుల్ మరియు శ్రద్ధ చెప్పినట్లు సమాచారం అందుతుంది. ఈ కేసును లోతుగా పరిశీలిస్తున్న అధికారులు మరోమారు ఈ నలుగురు హీరోయిన్స్ ని విచారణకు పిలిచే అవకాశం ఉంది. ముంబైలో ఏళ్లుగా పాతుకుపోయిన డ్రగ్స్ మాఫియాను వెలికితీయడానికి దాదాపు ఆరు నెలల సమయం పట్టవచ్చని అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 20 మంది బడా డ్రగ్ డీలర్ల సమాచారం అధికారుల దగ్గర ఉన్నట్లు సమాచారం.