బిగ్ బాస్ సక్సెస్ ఫుల్ గా నాలుగు వారాలు కంప్లీట్ చేసుకుంది. షోని తన అందాలతో ఊపేస్తోంది, స్ట్రాంగ్ కంటెస్టెంట్ అవుతుందనుకున్న స్వాతి దీక్షిత్ కేవలం తక్కువ సమయంలోనే ఇంటిదారి పట్టింది. ఆడియన్స్ ఆమెను చాలా త్వరగా ఇంటికి పంపారు. నిన్న నాగార్జున కంటెస్టెంట్స్ తో సరదా ఆటలు ఆడారు. ఓ రేంజ్ లో ఎంజాయ్ చేశారు. అబ్బాయిలు అమ్మాయిలుగా, అమ్మాయిలు అబ్బాయిలుగా మారి స్టెప్స్ తో డైలాగ్స్ తో అదరగొట్టారు.సరదగా సాగిన షోలో నామినేషన్ లో ఉన్న సభ్యుల పొజిషన్స్ ఓట్ల గురించి నాగార్జున కొన్ని షాకింగ్ ఫాక్ట్స్ చెప్పారు. 

ఇక నేడు సోమవారం కావడంతో నామినేషన్స్ ప్రక్రియ జరగనుంది. ఇంటి సభ్యుల నుండి కొందరు వచ్చే వారం కొరకు నామినేట్ అవుతారు. ఈ నామినేషన్స్ టాస్క్ లో ఓ సంఘటన చోటు చేసుకుంది. అభిజిత్ మరియు అఖిల్ మధ్య వాగ్వాదం జరిగింది. అది కూడా మోనాల్ గురించి కావడంతో విషయం చాలా సీరియస్ గా మారింది. 

మొదటి నుండి మోనాల్ కి అభిజిత్ దగ్గర కావాలని చూస్తున్నారు. ఐతే అఖిల్, మోనాల్ ఇప్పటికే ఓ జంటగా   మారినట్లు ఇంటి సభ్యులతో పాటు, ప్రేక్షకులు కూడా ఫిక్స్ అయ్యారు. నేటి ఎపిసోడ్ లో మోనాల్ కోసం వీరిద్దరి యుద్ధం శృతిమించినట్లు అనిపిస్తుంది. మోనాల్ తో మాట్లాడితే నీకెందుకు అని అభిజిత్ అనగా, వేలు చూపించి మాట్లాడవద్దని అఖిల్ అన్నారు. తన కోసం ఇద్దరు గొడవపడటం మోనాల్ కన్నీరు పెట్టుకొనేలా చేసింది.