టాలీవుడ్‌ లో తల్లి పాత్రలతో ఫేమస్ అయిన నటి ప్రగతి. చిన్న వయసులోనే తల్లి పాత్రలు వేయటం ప్రారంభించి ఈమె, ఇక ఆ పాత్రలకే ఫిక్స్‌ అయ్యిపోయింది. అయితే సినిమాల్లో హుందాగా కనిపించినా సోషల్ మీడియాలో మాత్రం కాస్త హాట్ గా కనిపించటం ఈమెకు అలవాటు. హీరోయిన్‌ల రేంజ్‌లో అందాలు ఆరబోయకపోయినా తన దైన స్టైల్‌లో స్పైసీ లుక్స్‌లో అదరగొడుతుంది ప్రగతి.

గతంలో తన డ్యాన్స్ వీడియోతో సోషల్ మీడియాను షేక్ చేసింది. కుర్ర హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోని రేంజ్‌ లో మాస్ డ్యాన్స్ ఇరగదీసింది. అంతేకాదు వర్క్ అవుట్ డ్రెస్‌ హాట్ హాట్‌గా ఫోజులిచ్చింది. తాజాగా మరోసారి తన డ్యాన్సింగ్ స్కిల్స్‌తో అదరగొట్టింది ఈ బ్యూటీ. తన వయసును కూడా పక్కన పెట్టేసిన నడుము ఊపుతూ బెల్లీ డ్యాన్స్ చేసింది ప్రగతి.

తెలుగులో వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ ప్రస్తుతం లాక్‌ డౌన్‌ కారణంగా ఇంటికే పరిమితమైంది. దీంతో తన ఫిజిక్‌ మీద దృష్టి పెట్టి ప్రగతి వర్క్‌ అవుట్స్ చేస్తూ డ్యాన్సులు చేస్తూ అదరగొట్టింది. తాజాగా ప్రగతి పోస్ట్ చేసిన డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Not a bad try 😈

A post shared by Pragathi Mahavadi (@pragstrong) on May 31, 2020 at 1:52pm PDT