బాలీవుడ్ నటి తనుశ్రీ దత్తా తనపై లైంగిక వేధింపులు జరిగినట్లు దానికి కారకులైన వారి పేర్లను వెల్లడించడం హాట్ టాపిక్ గా మారింది. నటుడు నానాపటేకర్ తన పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారని, ఆయన్ని వ్యతిరేకించినందుకు తన తల్లితండ్రులతో కారులో వెళ్తుండగా దాడి చేయించారని అన్నారు.

అయితే ఈ సంఘటన ఎప్పటికీ మర్చిపోలేనని తనుశ్రీదత్తా సోదరి ఇషితా దత్తా వెల్లడించారు. అప్పుడు జరిగిన సంఘటనను గుర్తుచేసుకొని మీడియా ముందు ప్రస్తావించారు ఇషితా దత్తా. 'మా కారుపై దాడి జరిగిన దృశ్యాలను టీవీలో చూశాను.
దాడికి పాల్పడిన వ్యక్తులు కారుపై ఎగబడ్డారు. కారు అద్దాల్ని పగలగొట్టారు. అప్పుడు భయపడ్డ నా తల్లితండ్రులు, అక్క ముఖం నాకు ఇంకా గుర్తుంది.అప్పుడు నేను వాళ్లతో లేకపోవడంతో ఏం చేయాలో అర్ధం కాలేదు. ఈ సంఘటన నేను ఎప్పటికీ మర్చిపోలేను' అంటూ చెప్పుకొచ్చింది.
కాలం గడుస్తున్న కొద్దీ ఈ విషయం మర్చిపోతామని అనుకోవడం పొరపాటని, అది మా జీవితాలపై ముద్రలా పడిపోయిందని అన్నారు. ఇలాంటి వేధింపులకు వ్యతిరేకంగా తనుశ్రీ పోరాడుతోందని అన్నారు.
సంబంధిత వార్తలు..
హీరో ముందు బట్టలిప్పి నగ్నంగా డాన్స్ చేయమన్నారు.. హీరోయిన్ కామెంట్స్!
ఆ హీరో డాన్స్ భంగిమల గురించి చెప్తానని తప్పుగా ప్రవర్తించాడు.. హీరోయిన్ కామెంట్స్!
నానా పటేకర్ మహిళలను కొడతాడు.. లైంగికంగా వేధిస్తాడు: హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!
ఆమె చేస్తోన్న ఆరోపణల్లో నిజం లేదు.. తనుశ్రీపై కొరియోగ్రాఫర్ ఫైర్!