250 కోట్లతో నిర్మించిన భారీ బడ్జెట్ చిత్రం సైరా నరసింహా రెడ్డి అక్టోబర్ 2న ప్రేక్షకులముందుకు రానుంది. దక్షిణాది అన్ని భాషలతో సహా హిందీలో కూడా ఈ చిత్రాన్ని నిర్మించారు. నిన్న ఈ చిత్ర ట్రైలర్ విడుదలయ్యింది. విడుదలైన 45 నిముషాల్లోనే లక్ష లైకులను కూడా సాధించింది. ఖైదీ 150 విడుదలైన చాలా గ్యాప్ తరువాత చిరంజీవి నట విశ్వరూపం చూపెట్టేసాడని ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. ఈ చిత్ర ట్రైలర్ ను థియేటర్లలో విడుదల చేయడం ద్వారా భారీ బజ్ ని క్రియేట్ చేయడంలో సైరా చిత్ర యూనిట్ సక్సెస్ అయ్యిందని చెప్పవచ్చు.   

సైరా చిత్రం క్రియేట్ చేసిన ఈ బజ్ వల్ల భారీ స్థాయిలోనే ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ముఖ్యంగా ఓవర్సీస్ మార్కెట్లో సైరా ప్రీ రరిలీజ్ బిజినెస్ అదిరిపోయింది. అందుతున్న సమాచారం మేరకు ఇప్పటికే 2లక్షల 62వేల డాలర్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. 

ఇప్పుడు సైరా రిలీజ్ డేట్ సైరా ప్రీమియర్ షో కలెక్షన్లను ప్రభావితం చేస్తుందేమో అని ఫ్యాన్స్ కలవరపడుతున్నారు. సైరా సినిమా సోమవారం సాయంత్రం విడుదలవుతుంది. ఆ రోజు వీక్ డే అవడంవల్ల అమెరికాలో టికెట్లపై భారీ స్థాయిలో ఆఫర్స్ ఉంటాయి. వన్ ప్లస్ వన్ నుంచి మొదలుకొని టిక్కెట్లపైన 50శాతం ఆఫ్ వరకు రకరకాల ఆఫర్స్ ఉంటాయి. 

టిక్కెట్లు ఎక్కువగా అమ్ముడైనా, కలెక్షన్లు మాత్రం ఇలాంటి ఆఫర్లవల్ల తక్కువగా నమోదవ్వొచ్చని ట్రేడ్ అనలిస్టులు భావిస్తున్నారు. అదే ఏ వీకెండ్ రోజో గనుక ఈ చిత్రం విడుదలయ్యుంటే ప్రస్తుతం ఉన్న బజ్ వల్ల సినిమా చాల తేలికగా అజ్ఞాతవాసి రికార్డులని చెరిపేసి ఉండేదని అంటున్నారు. 

ఈ మంగళవారం రిలీజ్ వల్ల 1 మిలియన్ మార్కును కొద్దిగా కష్టంగా అయినా చేరుకోవచ్చు అంటున్నారు.  వీకెండ్ లో గనుక సైరా విడుదలయ్యుంటే దీనికి ఇంకో 50శాతం అదనంగా వసూలుచేసి ఉండేది అనడంలో ఎటువంటి సందేహం లేదు. 

ప్రీమియర్ షోల విషయం అటుంచితే, ఈ చిత్రం లాంగ్ రన్ లో కలెక్షన్ల వర్షం కురిపిస్తుందనడంలో ఎటువంటి డౌట్ అక్కర్లేదు. ఖైదీ నెంబర్ 150 కూడా మౌత్ పుబ్లిసిటీ వల్ల ఊపందుకొని థియేటర్లకు ఫుట్ ఫాల్స్ పెరిగాయి. సైరా చిత్రం కథ, కథనం బలంగా ఉన్నట్టు తెలియవస్తోంది. ఇలాంటి పీరియాడిక్ డ్రామాలు, అందునా దేశభక్తితో నిండి ఉన్న సినిమా కావడం సైరాకు కలిసివచ్చే అంశం. సో, ఓవర్సీస్ లో కాసుల వర్షం గ్యారంటీ అన్నమాట!