మెగాస్టార్ చిరాంజీవి నటించిన హిస్టారికల్ ఫిల్మ్ సైరా నరసింహా రెడ్డి అక్టోబర్ 2న గ్రాండ్ గా విడుదల కాబోతున్న విషయం తెలిసిందే.  మెగాస్టార్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన సైరా హవా మాములుగా లేదు. అభిమానులు ఫస్ట్ డే దీర్స్ షో చూడాలని ఎదురుచూస్తున్నారు. ఇక ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ తో సినిమా సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. 

మొదటిరోజు దాదాపు అన్ని ఏరియాల్లో హౌస్ ఫుల్ బోర్డులు దర్శనమిచ్చే అవకాశం ఉంది. అసలు మ్యాటర్ లోకి వెళితే సినిమా ప్రీమియర్ షోల కోసం హార్డ్ కొర్ ఫ్యాన్స్ ఇంటర్నెట్ లో తెగ సెర్చ్ చేస్తున్నారు. అయితే శామీర్ పెట్, అలియా బాద్ లోని శ్రీ కృష్ణ థియేటర్ లో ప్రీమియర్ కు ఏర్పాట్లు జరుగుతున్నట్లు సమాచారం. అక్టోబర్ రెండున తెల్లవారు జామున మూడు గంటలకు ప్రీమియర్ షోను ప్రదర్శించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

దీంతో అభిమానులు మొదటి షోను చూడాలని టికెట్ల కోసం ఎగబడుతున్నారు. కొణిదెల ప్రొడక్షన్ లో రామ్ చరణ్ నిర్మించిన ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. అమితాబ్ బచ్చన్ - విజయ్ సేతుపతి - సుదీప్ వంటి స్టార్స్ ముఖ్యపాత్రలో కనిపించబోతున్నారు.  నయనతార - తమన్నా కథానాయికలుగా కనిపించబోతున్నారు.