టాలీవుడ్‌ మ్యాన్లీ హంక్‌ రానా దగ్గుబాటి మంగళవారం తనకు కాబోయే శ్రీమతిని పరిచయం చేసిన సంగతి తెలిసిందే. సొంతంగా డ్యూ డ్రాప్‌ డిజైన్‌ స్టూడియో అనే కంపెనీని నిర్వహిస్తున్న మిహికా బజాజ్‌ తన ప్రేమను అంగీకరించింది అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు రానా. చాలా కాలంగా పెళ్లి విషయంలో ఎదురయ్యే ప్రశ్నలను దాటవేస్తూ వస్తున్న రానా తన ప్రేయసిని పరిచయం చేయటంతో ఒక్కసారిగా ఈ వార్త వైరల్‌గా మారింది. అయితే తారా ప్రేమకు పెద్దల అంగీకారం ఉందా లేదా అన్న చర్చ కూడా మొదలైంది.

ఈ వార్తలపై రానా తండ్రి, ప్రముఖ నిర్మాత సురేష్ బాబు స్పందించాడు. ఓ ఇంగ్లీస్ మీడియాతో మాట్లాడుతూ `రానా నిర్ణయంతో మా ఫ్యామిలీ చాలా ఆనందంగా ఉంది. రానా, మిహికాలు చాలా కాలంగా ఒకరిని ఒకరు తెలుసుకున్నారు. అందుకే మేం కూడా సంతోషంగా ఉన్నాం. డిసెంబర్‌లోనే పెళ్లి చేయాలని భావిస్తున్నాం. పరిస్థితులు త్వరగా చక్కబడితే ముందే చేస్తాం. నిర్ణయం తీసుకున్న తరువాత అధికారింగా అందరికీ తెలియజేస్తాం. ప్రస్తుతం పెళ్లి ప్లానింగ్ లో ఫ్యామిలీ అంతా బిజీగా ఉంది` అంటూ చెప్పారు.

ఇక సినిమాల విషయానికి వస్తే.. ఇటీవల సినిమాల నుంచి లాంగ్‌ బ్రేక్ తీసుకున్న రానా పెడింగ్‌లో ఉన్న ప్రాజెక్ట్‌లను కంప్లీట్‌ చేసే పనిలో ఉన్నాడు. ఇప్పటికే అరణ్య పనులన్ని పూర్తి చేయగా మరికొన్ని సినిమాలు నిర్మాణ దశలో ఉన్నాయి. అదే సమయంలో తన డ్రీమ్‌ ప్రాజెక్ట్‌గా ప్లాన్ చేస్తున్న భారీ చిత్రం హిరణ్య కశ్యప ప్రీ ప్రొడక్షన్‌ పనులు కూడా శర వేగంగా జరుగుతున్నాయి. ముందుగా లాక్‌ డౌన్‌ సడలించిన వెంటనే అరణ్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు రానా.