న్యూడ్ పిక్ : విమర్శలు మూటగట్టుకున్న సన్నీలియోన్

Sunnyleone nude pic goes viral
Highlights

న్యూడ్ పిక్ విమర్శల మూటగట్టుకున్న సన్నీలియోన్

పోర్న్ స్టార్ గా పాపులరయి బాలీవుడ్ లో అడుగుపెట్టింది సన్నీ లియోన్. ఇండియాలో ఆమె తక్కువ కాలంలోనే చాలా ఫేమస్ అయిపోయింది. ఆమె నటించిన ఐటం సాంగులు ప్రేక్షకులను ఒక ఊపు ఊపడంతో బాలీవుడ్ లో బిజీ అయిపోయింది. హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోని క్రేజ్ ఆమెకు వచ్చేసింది. 

యాక్టర్ గా సెక్సీ ఇమేజ్ ఉన్నా వ్యక్తిగతంగా స్టార్లు ఎవరూ తీసుకోని డేరింగ్ స్టెప్ తీసుకుంది సన్నీలియోన్. తన భర్త డేనియల్ వెబర్ తో కలిసి మహారాష్ట్రలోని లాతూర్ నుంచి ఓ పాపను దత్తత తీసుకుని పెంచుకుంటోంది. ఆమెకు నిషా అని పేరు పెట్టి అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు. ఆమెను దత్తత తీసుకున్న ఎనిమిది నెలలకు ఇద్దరు కవల మగపిల్లలు పుట్టారు. ఫాదర్స్ డే సందర్భంగా సన్నీలియోన్ దంపతులు తమ కూతురు నిషాతో కలిసి తీసుకున్న ఓ ఫొటోను డేనియల్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ ఫొటోలో సన్నీ.. ఆమె కూతురు నేక్ డ్ గా ఉంటారు. అలాగని ఇందులో అసభ్యత కూడా ఏమీ కనిపించదు. 

ఈ ఫోటో చూశాక నెటిజన్లు కొందరు సన్నీలియోన్ దంపతులపై ట్రోలింగ్ మొదలుపెట్టారు. ఈ విధంగా ఎలా కనిపిస్తారంటూ నెగిటివ్ కామెంట్లతో ఓ రకంగా తిట్లు స్టార్ట్ చేశారు. ఇంకొందరు మాత్రం సన్నీని సపోర్ట్ చేశారు. అమ్మ ఎలా డ్రస్ చేసుకోవాలి? దీనికి సమాధానం అంటూ ఉండదు. నెగిటివ్ గా చూడటం మానేయండి అంటూ సలహాలిస్తున్నారు. సన్నీలియోన్ బయోపిక్ కరణ్ జిత్ కౌర్ - ద అన్ టోల్డ్ స్టోరీ ఆఫ్ సన్నీలియోన్ వెబ్ సిరీస్ లో నటించింది. ఇది త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. 

loader