సాఫ్ట్ వేర్ కుర్రాళ్లకు ఛాన్స్ ఇస్తున్నాడా..?

software guys to work with hero ram
Highlights

యంగ్ హీరో రామ్ ప్రస్తుతం త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో ఓ సినిమాను పూర్తి చేసే పనిలో 

యంగ్ హీరో రామ్ ప్రస్తుతం త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో ఓ సినిమాను పూర్తి చేసే పనిలో పడ్డాడు.ఇటీవల దర్శకుడు ప్రవీణ్ సత్తారుతో ఓ సినిమా పూజా కార్యక్రమాలు నిర్వహించి కొన్ని కారణాల వలన ప్రీప్రొడక్షన్ స్టేజ్ లోనే సినిమా ఆపేశాడు. ప్రస్తుతం తన తదుపరి సినిమా కోసం డైరెక్టర్ ను వెతికే పనిలో పడ్డాడు.

పలువురు దర్శకులు రామ్ ను కలిసి కథలు వినిపించినప్పటికీ ఈ యంగ్ హీరో మాత్రం బెంగుళూరు నుండి వచ్చి స్టోరీ చెప్పిన ఇద్దరు సాఫ్ట్ వేర్ కుర్రాళ్ళతో సినిమా చేయాలనుకుంటున్నట్లు టాక్. సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి అనుభవం లేని ఇద్దరు సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేసే కుర్రాళ్ళు ఇటీవలరామ్ ను కలిసి తము రాసుకున్న ఓ స్టోరీ లైన్ ను వినిపించారట.

నిర్మాత స్రవంతి కిషోర్ పూర్తి కథను విని ఇంప్రెస్ అయినట్లు తెలుస్తోంది. ఈ కథనే రామ్ తదుపరి సినిమాకు లాక్ చేయాలనుకుంటున్నట్లు చెబుతున్నారు. అయితే డైరెక్టర్ గా వాళ్లనే తీసుకుంటారా..? లేక అనుభవం ఉన్న వారి చేతిలో ఈ కథను పెడతారో చూడాలి!

loader