సాహో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా చేరువైన బాలీవుడ్‌ అందాల భామ శ్రద్ధా కపూర్‌. ఇటీవల ఈ బ్యూటీ తన సోషల్ మీడియా పేజ్‌లో 50 మిలియన్ల (5 కోట్ల) ఫాలోవర్స్ మార్క్‌ను అందుకుంది. తెర మీద అద్భతుమైన పర్ఫామెన్స్‌తో ఆకట్టుకునే ఈ బ్యూటీ తెర వెనుక కూడా అందరి మనసులు గెలుచుకుంది. అయితే సోషల్ మీడియాలో తనకు భారీ ఫాలోయింగ్ సాధించిపెట్టిన అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుతూ ఆమె మూడు భాషల్లో తన స్వహస్తాలతో రాసిన నోట్స్‌తో కృతజ్ఞతలు తెలిపింది.

హిందీ, ఇంగ్లీష్‌తో పాటు తన మాతృభాష మరాఠిలోనూ నోట్‌ను రాసింది శ్రద్ధా కపూర్‌. `ప్రియమైన ఫ్యాన్ క్లబ్‌, శ్రేయోభిలాషులకు. నేను మీరు పంపుతున్న వీడియోస్‌, ఎడిట్స్‌, పోస్ట్ అన్ని చూస్తున్నా. మీరు చూపిస్తున్న ప్రేమకు కృతజ్ఞతలు. మీ అభిమానం కారణంగానే నేను ఈ రోజు ఇక్కడ ఉన్నాను. మీరు నా మీద చూపిస్తున్న ప్రేమకు ఎన్నో రెట్లు మీరు తిరగి పొందాలని కోరుకుంటున్నా. మీరంతా జాగ్రత్తగా ఉండండి. ప్రేమను పంచండి. 5 కోట్ల సార్లు కృతజ్ఞతలు అంటూ కామెంట్ చేసింది శ్రద్ధా.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

🙏🦋🦄 🌻💫💜

A post shared by Shraddha ✶ (@shraddhakapoor) on Jul 15, 2020 at 8:11pm PDT

అయితే శ్రద్ధా ఈ ఘనత సాధించటం వెనుక చాలా కారణాలు ఉన్నాయి. ముఖ్యం లాక్‌ డౌన్ సమయంలో అభిమానులకు జాగ్రత్త సూచిస్తూ చాలా ట్వీట్లు చేసింది శ్రద్ధా కపూర్‌. అదే సమయంలో ఈ విపత్కర పరిస్థితుల్లో ఆకలితో అలమటిస్తున్న జంతువుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలంటూ అభిమానలుకు సూచించింది. ఓ ప్రకృతి ప్రేమికురాలిగా చెక్క టూత్ బ్రెష్ వాడాలని స్నానానికి షవర్‌కు బదులుగా బకెట్ యూజ్ చేయాలి అంటూ సూచించింది.