Asianet News TeluguAsianet News Telugu

సైనా నెహ్వాల్ దగ్గర బ్యాడ్నింటన్ నేర్చుకుంటున్న బాలీవుడ్ బ్యూటీ

  • సైనా నెహ్వాల్ జీవిత కథ ఆధారంగా బాలీవుడ్ మూవీ
  • బాలీవుడ్ చిత్రంలో సైనా పాత్ర పోషిస్తున్న శ్రద్ధా కపూర్
  • శ్రద్ధా కపూర్ కు బ్యాడ్మింటన్ మెళకువలు నేర్పిస్తున్న సైనా
shraddha kapoor in saina nehwal biopic training

భారతీయ స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ బయోపిక్ ను బాలీవుడ్ లో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో సైనా పాత్రను హీరోయిన్ శ్రద్దాకపూర్ పోషిస్తోంది. దీంతో, బ్యాడ్మింటన్ లో కోచింగ్ కోసం హైదరాబాద్ కు వచ్చింది శ్రద్ధ. పుల్లెల గోపీచంద్ అకాడెమీలో గోపీచంద్, సైనాలతో కలసి ఆమె ట్రైనింగ్ సెషన్ లో పాల్గొంది. ఈ ట్రైనింగ్ కు సంబంధించిన ఫొటోలను సైనా నెహ్వాల్ తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేసింది. 'గోపీ సర్.. శ్రద్ధాకపూర్.. నేను' అనే కాప్షన్ ను ఫొటోకు జత చేసింది.

 

ఇక ప్రభాస్ సరసన సాహో చిత్రంలోనూ నటిస్తున్న శ్రద్ధ తెలుగు నేర్చుకోవటంలోనూ తన ప్రతిభ కనబరుస్తోందని తెలుస్తోంది. ఇప్పటికే తెలుగు నేర్పించాలని ప్రభాస్ తో డీల్ కుదుర్చుకుందట ఈ ఆశిఖి2 భామ.

Follow Us:
Download App:
  • android
  • ios