'మా' అసోసియేషన్ వివాదం రోజురోజుకి ముదురిపోతుంది. అసోసియేషన్ లో ఉన్న రూ.5.50 కోట్ల ప్రజల డబ్బుని దుర్వినియోగం చేస్తున్నారని అధ్యక్షుడు శివాజీరాజాపై మండిపడుతున్నారు ప్రధాన కార్యదర్శి నరేష్. అయితే తాను ఎలాంటి మోసం చేయలేదని, డబ్బు దుర్వినియోగమైందని నిరూపిస్తే రాజీనామా చేస్తానని శివాజీరాజా స్టేట్మెంట్లు ఇచ్చాడు.

ఈ వివాదంలో చిరంజీవిని కూడా లాగడంతో విషయం మరింత పెద్దదైంది. సామరస్యంగా పరిష్కరించుకోవాల్సిన విషయాన్ని రచ్చ చేసి 'మా' అసోసియేషన్ తప్పు చేసిందనే భావన చిరుకి కలిగిందట. ముఖ్యంగా ఆయన శివాజీరాజా టీమ్ పై ఆగ్రహంగా ఉన్నట్లు సమాచారం. నరేష్ ఆధారాలతో సహా మీడియా ముందుకు రావడం, ఆయన మాట్లాడిన ప్రతి ఒక్క విషయం సబబుగా అనిపించడంతో ఇండస్ట్రీ మొత్తం నరేష్ కి సపోర్ట్ చేస్తున్నట్లు అర్ధమవుతుంది.

చిరంజీవి కూడా వీలైనంత తొందరగా ఈ విషయాన్ని పరిష్కరించాలని అనుకుంటున్నాడు. మరి శివాజీరాజా తప్పుందని తేలితే.. నిజంగానే రాజీనామా చేస్తారేమో చూడాలి!

ఇవి కూడా చదవండి..

'మా' కాంట్రవర్సీ.. మహేష్ బాబు హ్యాండ్ ఇచ్చేశాడు!

'మా' వివాదం.. చిరంజీవిని ఇరికిస్తున్నారా..?

ఆడపిల్లల్ని కాల్చుకుతినే బ్రోకర్లు వాళ్లు.. 'మా' వివాదంపై శ్రీరెడ్డి కామెంట్స్!

మహేష్ విషయంలో నమ్రతతో నేరుగా డీల్ చేశారు.. 'మా' వైఖరిపై నరేష్ గుస్సా!