Asianet News TeluguAsianet News Telugu

ఇంటర్నెట్ ను షేక్ చేసిన సమంత బోల్డ్ ఫొటోషూట్.. మరోసారి వైరల్ గా మారిన వీడియో!

దక్షిణాది చిత్ర పరిశ్రమలో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్ సమంత. బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తూ ఎప్పుడూ  నెట్టింట హాట్ టాపిక్ గానే మారుతుంటుంది. ఈ క్రమంలో తాజాగా ఈ బ్యూటీకి సంబంధించిన ఓ బోల్డ్ ఫొటోషూట్ కూడా వైరల్ గా మారింది. 
 

Samanthas bold photoshoot that shook the internet the video has gone viral again!
Author
First Published Nov 24, 2022, 6:16 PM IST

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.  సౌత్ హీరోయిన్లలో టాప్ యాక్ట్రెస్ గా వెలుగొందుతోంది. హీరో నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత కేరీర్ పై మరింతగా ఫోకస్ పెట్టింటి. వెన్వెంటనే తన ముందుకు వచ్చిన ప్రాజెక్ట్ లను ఫైనల్ చేస్తూ సెట్స్ మీదికి తీసుకెళ్లింది. ఈ క్రమంలో రీసెంట్ గా సమంత లీడ్ రోల్ లో నటించిన  సైంటిఫిక్ యాక్షన్ ఫిల్మ్ ‘యశోద’ (Yashoda) థియేటర్లలోకి వచ్చి బ్రహ్మండమైన రెస్పాన్స్ ను దక్కిచుకుంది. 

అయితే, సమంత సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభంలో సినిమాలతో పాటు యాడ్ షూట్లను కూడా ఓకే చేసింది. అందులో బర్బెర్రీ బ్రాండ్ కు సంబంధించిన బికినీ ప్రాడక్ట్స్ ను ప్రమోట్ చేస్తూ హాట్ అండ్ బోల్డ్ ఫొటోషూట్ చేసింది. గతంలో చేసిన ఈ ఫొటోషూట్ కు సంబంధిన పిక్స్ అప్పుడు ఇంటర్నెట్ ను కుదిపేశాయి. కొద్దిరోజుల పాటు వైరల్ అవుతూనే వచ్చాయి. తాజాగా అదే ఫొటోషూట్ కు సంబంధించిన వీడియో క్లిప్ నెట్టింట వైరల్ గా మారింది. ఫొటోషూట్ లో సమంత జిప్ చేయని బ్లాక్ పాయింట్, పూర్తిగా టాప్ గ్లామర్ చూపించేలా బ్లాక్ బికీనీలో బోల్డ్ గా ఫొటోషూట్ చేసింది. మతులు పోయేలా పోజులిచ్చింది. స్లిమ్ ఫిట్ అందాలను ప్రదర్శించిన సమంత.. ఈ ఫొటోషూట్ ద్వారా మరోసారి ఇంటర్నెట్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. 

సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ సమంత తన అభిమానులకు ఎప్పటికప్పుడు టచ్ లోనే ఉంటుంది. గ్లామర్ ఫొటోలనూ షేర్ చేస్తూ మంటలు రేపుతుంటుంది. సమంత చేసిన అన్ని ఫొటోషూట్లలో ఇదే ఎక్కువగా వైరల్ అయ్యింది. ఇక సమంత ప్రస్తుతం అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలిసిందే. మయో సైటిస్‌ అనే అరుదైన వ్యాధితో ఆమె బాధపడుతుందని తెలుస్తోంది. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఆమె ఇంట్లోనే పూర్తిగా రెస్ట్ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.  ఆమె త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. 

కేరీర్ విషయానికొస్తే.. సమంత టాలీవుడ్ తో పాటు అటు బాలీవుడ్ లోనూ బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైనప్ లో పెట్టింది. ఇప్పటికే ‘యశోద’తో మళ్లీ వెండితెరపై అలరించగా.. మున్ముందు ‘శాకుంతలం’, ‘ఖుషి’తో ఆకట్టుకోనుంది. ఇప్పటికే ఈ చిత్రాలు శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నాయి. మరోవైపు బాలీవుడ్ లో ‘ఫ్యామిలీ మ్యాన్ 2’ డైరెక్టర్ తీయబోతున్న నెక్ట్స్ మూవీలోనూ నటించబోతోంది. తదితర ప్రాజెక్టులు కూడా లిస్టులో ఉన్నట్టు తెలుస్తోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios