బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ తన సహచర నటులకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పిన సందర్భాలు చాలా తక్కువ. తాజాగా సల్లూ బాయ్ తన మాజీ గర్ల్‌ ఫ్రెండ్‌, కత్రినా కైఫ్ కు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేశాడు. టైగర్‌ జిందాహై సినిమా షూటింగ్ సందర్భంగా తీసిన ఓ రొమాంటిక్‌ ఫోటోను ఫోటో చేస్తూ శుభాకాంక్షలు తెలిపాడు సల్మాన్‌. ఫోటోతో పాటు హ్యాపీ బర్త్‌ డే కత్రినా అంటూ కామెంట్  చేశాడు సల్మాన్‌.

టైగర్‌ జిందాహై సినిమాలోని దిల్ దియా గల్లాన్‌ పాటలోని సీన్‌ను పోస్ట్ చేశాడు సల్మాన్‌. కత్రినా గురువారం తన పుట్టిన రోజు జరుపుకుంది. సల్మాన్‌ తో పాటు బాలీవుడ్ సెలబ్రిటీలు కత్రినాకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. కత్రినా ప్రస్తుతం ముంబైలోని తన నివాసంలో చెల్లెలు ఇసాబెల్లాతో కలిసి ఉంటుంది.

సల్మాన్, కత్రినాలు కలిసి ఎక్తా టైగర్‌, టైగర్‌ జిదాహై, మైనే ప్యార్‌ కౌన్‌ కియా, యువరాజ్‌, భారత్‌ సినిమాల్లో కలిసి నటించాడు సల్మాన్‌, కత్రినా. ఆ సమయంలో వీరిద్దరూ రిలేషన్‌ఫిప్‌లో ఉన్నట్టుగా వార్తలు వినిపించాయి. ప్రస్తుతం కత్రినా అక్షయ్‌ కుమార్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Happy bday Katrina . . @katrinakaif

A post shared by Salman Khan (@beingsalmankhan) on Jul 16, 2020 at 2:52am PDT