Asianet News TeluguAsianet News Telugu

ఆర్యన్ ఖాన్ బెయిల్ నిరాకరణపై సల్మాన్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ సోమి అలీ ఘాటు వ్యాఖ్యలు

ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటీషన్ రెండుసార్లు తిరస్కరణకు గురికాగా, Somy ali సోషల్ మీడియా వేదికగా ఘాటు వ్యాఖ్యలు చేశారు.  

salman khan ex girl friend somy ali fires as aryan khan bail rejected
Author
Hyderabad, First Published Oct 22, 2021, 1:12 PM IST

డ్రగ్స్ కేసులో అరెస్ట్ కాబడిన ఆర్యన్ ఖాన్ కి ఇప్పటికే మద్దతు ప్రకటించిన మాజీ హీరోయిన్ సోమి అలీ మరోమారు ఈ విషయంపై స్పందించారు. ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటీషన్ రెండుసార్లు తిరస్కరణకు గురికాగా, Somy ali సోషల్ మీడియా వేదికగా ఘాటు వ్యాఖ్యలు చేశారు.  పోలీసు వ్యవస్థ చట్టాలను అడ్డుపెట్టుకొని 23ఏళ్ల యువకుడి జీవితం నాశయం చేస్తున్నాయన్న అభిప్రాయం వెల్లడించారు. 


దేశంలో అత్యాచారాలు, మర్డర్స్ జరుగుతున్నాయని, అలాంటి ఘోరాలపై దృష్టి పెట్టకుండా, ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ వాడాడని రాద్ధాంతం చేస్తున్నారు. మర్డర్స్, మానభంగాల కంటే మించిన నేరంగా డ్రగ్స్ వినియోగాన్ని పరిగణిస్తున్నారు. ఇదెక్కడి న్యాయం, ఇది ఖచ్చితంగా అధికార దుర్వినియోగం, అన్యాయం అంటూ విరుచుకుపడ్డారు. ఉద్దేశపూర్వకంగా Aryan khan ని ఇబ్బందులపాలు చేస్తున్నారని, సోమి అలీ ఇంస్టాగ్రామ్ సందేశం ద్వారా వెల్లడించారు. 


90లలో స్టార్ హీరోయిన్ గా బడా హీరోల సరసన నటించిన సోమి అలీ ప్రస్తుతం సోషల్ యాక్టివిస్ట్ గా పనిచేస్తున్నారు. నో మోర్ టియర్స్ ఇన్ యూఎస్ఏ పేరుతో ఓ సంస్థ స్థాపించి మహిళా హక్కులపై పోరాడుతున్నారు. అప్పట్లో నటుడు Salman khan తో సోమి అలీ డేటింగ్ చేశారన్న పుకార్లు ఉన్నాయి. 

Also read Bigg boss telugu 5: తల్లి పద్దతిగా ఉందా, కూతురు పద్దతిగా పెరగడానికి.. సిరికి ఘోర అవమానం
ఇక ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటీషన్ తిరస్కరించిన నేపథ్యంలో అతడిని ఆర్థర్ రోడ్ జైలుకు తరలించారు. నిన్న Shahruk khan స్వయంగా జైలుకు వెళ్లి కొడుకును కలిశారు. ఆర్యన్ ఖాన్ బైలు పిటీషన్ విచారణ అక్టోబర్ 30కి వాయిదా వేయడం జరిగింది. క్రూయిజ్ షిప్ లో ఆర్యన్ ఖాన్ తన మితృలతో రేవ్ పార్టీలో పాల్గొన్నాడని, ఈ పార్టీలో నిషేధిత డ్రగ్స్ ఉపయోగించారన్న ఆరోపణలపై అక్టోబర్ 3న అరెస్ట్ చేయడం జరిగింది. 

Also read నేను వాటిలో పెట్టుబడే పెట్టలేదు.. సంజనా గల్రానీ..!

కొడుకు అరెస్ట్ షారుక్ ని తీవ్ర ఆవేదనకు గురిచేసింది.కనీసం ఆర్యన్ ఖాన్ కి బెయిల్ కూడా రాకపోవడం మరింత కృంగదీస్తుంది. దర్శకుడు అట్లీ తో షారుక్ చేస్తున్న లయన్ చిత్ర షూటింగ్ ని కూడా షారుక్ ఆపివేసి, కొడుకును బయటికి తీసుకువచ్చే పనుల్లో నిమగ్నమయ్యాడు. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Somy Ali (@realsomyali)

Follow Us:
Download App:
  • android
  • ios