Asianet News Telugu

కరోనా టెస్ట్ నిరాకరించిన రేఖ, ఎందుకంటే!

అలనాటి అందాల నటి రేఖ సైతం హోమ్ క్వారంటైన్ లో ఉన్నారు. బాంద్రాలో ఉన్న రేఖా బంగ్లాకి సీ స్ప్రింగ్స్ అని పేరు. బంగ్లా ముందుండే ఇద్ద‌రు సెక్యూరిటీ గార్డుల్లో ఒక‌రికి క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. దీంతో రేఖ‌ బంగ్లాను కంటైన్‌మెంట్ జోన్‌గా ప్ర‌క‌టించింది బీఎంసీ. 

Rekha refuses to get tested for coronavirus
Author
Hyderabad, First Published Jul 15, 2020, 4:25 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

బాలీవుడ్ ప్రముఖులు ఒక్కొక్కరుగా కరోనా బారిన పడుతున్నారు. అలనాటి అందాల నటి రేఖ సైతం హోమ్ క్వారంటైన్ లో ఉన్నారు. 
బాంద్రాలో ఉన్న రేఖా బంగ్లాకి సీ స్ప్రింగ్స్ అని పేరు. బంగ్లా ముందుండే ఇద్ద‌రు సెక్యూరిటీ గార్డుల్లో ఒక‌రికి క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. దీంతో రేఖ‌ బంగ్లాను కంటైన్‌మెంట్ జోన్‌గా ప్ర‌క‌టించింది బీఎంసీ.  ఈ నేపధ్యంలో ఆమెను సైతం కరోనా టెస్ట్ చేయించుకోమని కోరగా ..ఆమె ఇష్టపడలేదు. అంతేకాదు మున్సిపల్ అధికారులను తమ ఇంట్లోకి రానివ్వలేదని బాలీవుడ్ మీడియా వర్గాల సమాచారం. సెక్యూరిటీ గార్డ్ కు వచ్చింది కదా అని టెస్ట్ చేయించుకోమని కోరితే...ఆమె తిరస్కరించారని చీఫ్ మెడికల్ ఆఫీసర్ సంజయ్ చెప్తున్నారు.

సంజయ్ మీడియాతో మాట్లాడుతూ...తాము రేఖను కరోనా టెస్ట్ చేయించుకోమని కోరామని ఆమె ఒప్పుకోవటం లేదని అన్నారు. ఆమె బంగ్లాకు శానిటైజ్ చేయటానికి వెళ్ళినా నిరాకరించారని చెప్తున్నారు. అంతేకాదు తమని లోపలకి కూడా రానివ్వలేదని, ఆమె మేనేజర్ ఫర్జానా డోర్ వెనక నిలబడి మాట్లాడారని చెప్పారు. 

రేఖ ఫోన్ నెంబర్ మేనజర్ ఇచ్చారని, దాంతో ఆమెతో ఫోన్ లో మాట్లాడమని చెప్పారు. అలాగే రేఖ...కరోనా వచ్చిన ఆ సెక్యూరిటీ గార్డ్ తో ఎప్పుడూ కాంటాక్ట్ లో లేనని, అతను బంగ్లాలోకి ఎప్పుడూ రాలేదని అన్నారు. అంతేకాదు..తనకు ఏ విధమైన కరోనా లక్షణాలు లేవని, తాను బాగానే ఉన్నట్లు చెప్పారని సంజయ్ అన్నారు. తనకు కరోనా లక్షణాలు ఏమైనా కనపడితే ఖచ్చితంగా టెస్ట్ చేయించుకుంటానని ప్రామిస్ చేసినట్లు తెలిపారు.
  
కాగా ప్ర‌స్తుతం ముంబైలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ప‌లువురు ప్ర‌ముఖులు ఈ వైర‌స్ బారిన ప‌డుతున్నారు. ఎన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నా కూడా ఈ వైర‌స్ మ‌హ‌మ్మారి వెంటాడుతూనే ఉంటుంది. తాజాగా బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ శనివారం సాయంత్రం ముంబైలోని నానావతి ఆసుపత్రిలో చేరారు.  

Follow Us:
Download App:
  • android
  • ios