Asianet News TeluguAsianet News Telugu

సెక్స్ నిపుణుడు డా.సమరంకే చెమటలు పట్టించాడు వర్మ

  • వర్మ రూపొందించిన జీ.ఎస్..టీ గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ పై టీవీ చర్చ
  • ఓ ఛానెల్ డిబేట్ లో వర్మతో పాటు చర్చలో పాల్గొన్న సెక్స్ నిపుణులు డా.సమరం
  • చర్చ సందర్భంగా సమరం ను అసాధారణ ప్రశ్నలతో ఇబ్బంది పెట్టిన వర్మ
ramgola varma poking with doctor samaram on tv live

సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ అంటేనే వివాదం. వివాదం పుట్టిందే రామ్ గోపాల్ వర్మకు అన్న రేంజిలో తన సెన్సేషనల్ కామెంట్స్ తో... సోషల్ మీడియాలో, టీవీ చర్చా కార్యక్రమాల్లో తన విమర్శకులపై విరుచుకుపడుతున్నారు. ఇటీవలే ఓ ఛానెల్ డిబేట్ లో సామాజిక కార్యకర్త దేవి తన జీఎస్టీపై చేసిన కామెంట్స్ పై స్పందిస్తూ... ఆవిడ బట్టలేసుకుని బెడ్ రూంలో సెక్స్ చేయాలని నేర్పుస్తున్నారా అసలు, ‘ఆమె నోరు విప్పితే చెత్తచెత్త అంటుంటారు ఆమెది చెత్త జీవితం’ అంటూ విరుచుకుపడిన వర్మ తాజాగా ప్రఖ్యాత సెక్సాలజిస్టు డాక్టర్ సమరంతోనూ అదే విధంగా పరాచకాలాడారు.

 

ఇటీవల చర్చనీయాంశమైన వర్మ గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ విడియో పై ఓ టీవీ ఛానెల్ చర్చా కార్యక్రమం నిర్వహించింది. ఈ చర్చా గోష్టిలో వర్మతో పాటు ప్రముఖ సెక్స్ నిపుణులు డా.సమరం పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన చర్చలో సమరం వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ప్రశ్నలు వేసి వర్మ తెగ ఇబ్బందిపెట్టారు. అది కూడా లైవ్ కావటంతో సమరం ఇబ్బంది పడ్డారు. అమెరికన్ పోర్న్ స్టార్ మియా మాల్కోవాతో తెరకెక్కించిన జీఎస్టీపై చర్చ సందర్భంగా డాక్టర్ సమరానికి రాంగోపాల్ వర్మ వేసిన ప్రశ్నపై అంతటా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 
    

‘గాడ్ సెక్స్ అండ్ ట్రూత్’పై చర్చ సందర్భంగా చివర్లో వర్మ.. ‘సమరం గారూ.. మీరు చివరిగా ఎప్పుడు సెక్సులో పాల్గొన్నారో చెప్పండి’ అని అడిగారు. దానికి సమరం  నవ్వి.. అది తన వ్యక్తిగత విషయం కాబట్టి ఓపెన్ ఫోరంలో షేర్ చేసుకోలేనని చెప్పారు. తాను తొలిసారి ఎప్పుడు హస్తప్రయోగం చేసుకున్నాను.. మొదటిసారి ఎప్పుడు సెక్స్ చేశాను భార్యతో ఏం చేస్తాను వంటివన్నీ కావాలంటే వర్మతో వ్యక్తిగతంగా కూర్చుని చర్చించగలనని సమాధానమిచ్చారు. చాలాకాలంగా సెక్స్ ఎడ్యుకేషన్ ను ప్రజల్లోకి తీసుకెళ్తున్న సమరం వంటివారిని ఇలా ఇబ్బంది పెట్టే ప్రశ్న అడగడంపై వర్మను నెటిజన్లతో పాటు అంతటా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  
 

Follow Us:
Download App:
  • android
  • ios