సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన సినిమాలతో కన్నా ఎక్కువగా తన ట్విటర్‌ కామెంట్‌లతోనే వార్తల్లో నిలుస్తుంటాడు. కేవలం సినిమాల విషయంలోనే కాదు రాజకీయ సామాజిక విషయాల్లోనూ తనదైన స్టైల్‌లో స్పందిస్తుంటాడు వర్మ. అయితే తరుచూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే రామ్‌ గోపాల్ వర్మ తాజాగా ఎన్టీఆర్ బర్త్‌డే సందర్భంగా కూడా ఓ ఇంట్రస్టింగ్ కామెంట్ చేశాడు. ఈ సారి ఎన్టీఆర్ బర్త్‌ డే సందర్భంగా ఆర్ఆర్ఆర్‌ టీం ఓ సర్‌ప్రైజ్‌ ఇస్తుందని అంతా భావించారు. కానీ లాక్‌ డౌన్‌ కారణంగా సర్‌ప్రైజ్‌ను రెడీ చేయలేకపోయారు టీం.

దీంతో నిరాశలో ఉన్న అభిమానుల కోసం గతంలో ఎన్టీఆర్‌ సిక్స్‌ ప్యాక్‌ చేసిన సందర్భంగా తీసిన ఓ ఫోటోను ట్వీట్ చేశాడు ఆయన ఫిజికల్‌ ట్రైనర్‌. అయితే ఈ ఫోటోకు సూపర్బ్ రెస్సాన్స్‌ వచ్చింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన అరవింద సమేత సినిమా కోసం ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ చేశాడు. ఈ సినిమా స్టార్టింగ్‌లో వచ్చే యాక్షన్‌ సీన్‌లో ఎన్టీఆర్‌ షర్ట్‌ లేకుండా కనిపించాడు. అయితే అదే సమయంలో ఎన్టీఆర్ సిక్స్‌ బాడీతో బాలీవుడ్ ప్రముఖ ఫోటోగ్రాఫర్‌ డబూ రత్నానితో ఓ ఫోటో షూట్ చేశాడు.

ఆ షూట్‌కు సంబంధించిన ఫోటోనే నిన్న రిలీజ్ చేశారు. ఆ ఫోటో పైనే వర్మ ఓ రేంజ్‌ కామెంట్ చేశాడు. ఫోటోను తన ట్విటర్‌ పేజ్‌లో పోస్ట్ చేసిన వర్మ, `హేయ్ తారక్‌ నేను గే కాదన్న విషయం నీకు తెలుసు. కానీ ఇప్పుడు నీ ఫోటో చూస్తుంటే నాకు గే కావాలన్న కోరిక కలుగుతుంది. ఆ బాడీ ఏంట్రా నాయనా` అంటూ కామెంట్ చేశాడు. ఎన్టీఆర్ బర్త్‌డే సందడి కూడా ఉండటంతో వర్మ చేసిన ఈ ట్వీట్ వైరల్‌గా మారింది.