ఫ్యాన్స్ ను ఒక విషయం బాగా కలవరపెడుతుంది. ప్రమోషన్లు ఇంకా ప్రారంభమవ్వలేదు. చూస్తుంటే కేవలం 5 రోజులు మాత్రమే ఇంకా సమయం మిగిలి ఉంది. చిరంజీవి 150వ సినిమా  ఖైదీ 150 కి కూడా కేవలం 5 రోజుల ముందే ప్రచార కార్యక్రమాలు మొదలుపెట్టారనుకోండి, అది వేరే విషయం. కేవలం అది తెలుగులో మాత్రమే విడుదలవుతుంది కాబట్టి పెద్ద ఇబ్బంది కలగలేదు. 

కాకపోతే సైరా దక్షిణాదిన అన్ని భాషలతో సహా హిందీ లో కూడా విడుదలవుతుంది. హిందీలో అదే రోజు భారీ తారాగణంతో, ఒళ్ళు గగ్గురపొడిచే యాక్షన్ సెక్వెన్సులతో వార్ సినిమా విడుదలవుతుంది. కాబట్టి హిందీ లో ప్రచార కార్యక్రమాలను ఇప్పటికే ప్రారంభిస్తే బాగుండేదని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. 

ఇక ఫ్యాన్స్ బెంగ పడాల్సిన అవసరం లేదు. బెంగ తీరినట్టే. హిందీ లో సినిమా మీద భారీ బజ్ క్రియేట్ చేయడానికి చిత్ర యూనిట్ ఒక మాస్టర్ ప్లాన్ వేసింది. ఎన్ని ఇంటర్వ్యూలు ఇచ్చినా రానంత బజ్ ని ఒక్క ప్రోగ్రాం తో తీసుకురాబోతున్నారు. ఒకే సారి ఇద్దరు మెగాస్టార్లతోని ఒక చిట్ చాట్ కార్యక్రమం ఏర్పాటు చేయబోతున్నారు. 

సైరా హిందీ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ దక్కించుకున్న ఫర్హాన్ అక్తర్ ఈ స్పెషల్ చాట్ షో ని హోస్ట్ చేయబోతున్నాడు. ఈ షోలో ఇద్దరు మెగాస్టార్లు చిరంజీవి, అమితాబ్ బచ్చన్ పాల్గొననున్నారు. వారు తమ సినీ కెరీర్ తో పాటు సైరా సినిమా గురించి అనేక విషయాలు చర్చించనున్నారు. సైరా సినిమా విశేషాలతోపాటు ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి చరిత్ర గురించి, కథలో డ్రామా ఎంత మేర ఆడ్ చేసారు తదితర అంశాలను గురించి ప్రస్తావిస్తారు.

ఈ చాట్ షో పూర్తవగానే ఇరు మెగాస్టార్లు లంచ్ చేస్తారు. దాంట్లోనుంచి కూడా కొన్ని షాట్స్ ని ఈ చాట్ షోలో ఆడ్ చేయనున్నట్టు సమాచారం. ఈ చాట్ షో కి సంబంధించిన షూటింగ్ రేపు జరగొచ్చని సమాచారం. లొకేషన్ విషయంలో చిత్ర బృందం పూర్తి క్లారిటీ ఇవ్వనప్పటికీ ముంబైలో జరగనుందని మాత్రం తెలియవస్తుంది. 

ఈ షూట్ పూర్తవగానే అదే రోజు ఎడిటింగ్ పూర్తిచేసి, చిత్రంలో నటించిన నటుల సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా ఈ చాట్ షోని అభిమానులకు అందించనున్నారు. ఇద్దరు మెగాస్టార్ల చాట్ షో బజ్ అంటే మామూలా చెప్పండి. వరుసపెట్టి ఎన్ని ఇంటర్వ్యూలు ఇచ్చినా రానంత బజ్ ని పర్ఫెక్ట్ ప్లానింగ్ తో చిత్ర యూనిట్ క్రియేట్ చేయబోతుంది.