Asianet News TeluguAsianet News Telugu

పబ్లిసిటీ కోసం చేయకండి.. 'మీటూ'పై రకుల్ కామెంట్!

హాలీవుడ్ నుండి మీటూ ఉద్యమం బాలీవుడ్ కి ఇప్పుడు టాలీవుడ్ కి కూడా పాకింది. భారతీయ చిత్ర పరిశ్రమని ఈ ఉద్యమం కుదిపేస్తోంది. దేశ వ్యాప్తంగా స్టార్లందరూ 'మీటూ' ఉద్యమంపై స్పందిస్తున్నారు. బాధితులకు మద్దతు తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు.

rakul preet singh about metoo movement
Author
Hyderabad, First Published Oct 16, 2018, 4:28 PM IST

హాలీవుడ్ నుండి మీటూ ఉద్యమం బాలీవుడ్ కి ఇప్పుడు టాలీవుడ్ కి కూడా పాకింది. భారతీయ చిత్ర పరిశ్రమని ఈ ఉద్యమం కుదిపేస్తోంది. దేశ వ్యాప్తంగా స్టార్లందరూ 'మీటూ' ఉద్యమంపై స్పందిస్తున్నారు.

బాధితులకు మద్దతు తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు. తాజాగా టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ 'మీటూ' ఉద్యమం గురించి స్పందించింది. ''భారత్ లో ఈ ఉద్యమంపై పోరాడుతుండడం ఆనందంగా అనిపిస్తోంది.

లైంగిక కోరికలు తీర్చమని వేధించడం, ఎదుటివారితో మిస్ బిహేవ్ చేయడం వంటివి పూర్తిగా భిన్నమైనవని నా అభిప్రాయం. ఈ రెండింటికీ మధ్య చిన్న గీత ఉంది. ఏదేమైనా ఈ ఉద్యమానికి ఈ స్థాయిలో మద్దతు రావడానికి కారణం సోషల్ మీడియా. ఈ లైంగిక వేధింపుల విషయంలో నేను చాలా లక్కీ అనుకుంటాను.

నేనెప్పుడూ ఇలాంటి పరిస్థితులను ఎదుర్కోలేదు. కానీ వేధింపులకి సంబంధించిన విషయాలను మాత్రం విన్నాను. ఇప్పటికైనా బాధితులందరూ బయటకి వచ్చి మాట్లాడుతుండడం అభినందించాల్సిన విషయం. అయితే పబ్లిసిటీ కోసం ఎవరూ ఈ ఉద్యమాన్ని దుర్వినియోగం చేయకూడదని కోరుకుంటున్నాను'' అంటూ చెప్పుకొచ్చింది!
 

ఇవి కూడా చదవండి.. 

దర్శకనిర్మాతలు వేధిస్తుంటే.. ఆ హీరో చూస్తుండిపోయాడు: నటి సంచలన కామెంట్స్!

సింగర్ చిన్మయి కామెంట్స్ పై రచయిత ఘాటు స్పందన!

నిన్ను రేప్ చేయాలి.. అంటే ఇలానే స్పందిస్తారు

నా చెస్ట్ టచ్ చేయడానికి ట్రై చేశారు.. సింగర్ చిన్మయి సంచలన కామెంట్స్!

ప్రముఖ లిరిసిస్ట్ పై లైంగిక ఆరోపణలు.. బాధితులకు చిన్మయి పిలుపు!

Follow Us:
Download App:
  • android
  • ios