బాలీవుడ్ నటి చిత్రాంగద సింగ్.. సినిమా షూటింగ్ సమయంలో దర్శకుడు, నిర్మాత తనను వేధిస్తుంటే ప్రముఖ హీరో నవజుద్ధీన్ సిద్ధిఖీ చూస్తూ ఉన్నారే తప్ప అడ్డుకోలేదని సంచలన వ్యాఖ్యలు చేసింది. సినీ పరిశ్రమలో మహిళా ఆర్టిస్టులు, సాంకేతికనిపుణులు తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి ఒక్కొక్కటిగా బయటపెడుతున్నారు.

బాలీవుడ్ నటి చిత్రాంగద సింగ్.. సినిమా షూటింగ్ సమయంలో దర్శకుడు, నిర్మాత తనను వేధిస్తుంటే ప్రముఖ హీరో నవజుద్ధీన్ సిద్ధిఖీ చూస్తూ ఉన్నారే తప్ప అడ్డుకోలేదని సంచలన వ్యాఖ్యలు చేసింది.

సినీ పరిశ్రమలో మహిళా ఆర్టిస్టులు, సాంకేతికనిపుణులు తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి ఒక్కొక్కటిగా బయటపెడుతున్నారు. ఈ క్రమంలో చిత్రాంగద కూడా తాను ఎదుర్కొన్న ఓ చేదు అనుభవాన్ని బయటపెట్టింది. గతేడాది కుశాన్ నంది దర్శకత్వంలో 'బాబుమోసాయ్ బందూక్ బాజ్' అనే సినిమాను రూపొందించారు. 

ఇందులో నవజుద్ధీన్ సిద్ధిఖీ, చిత్రాంగద సింగ్ నటించారు. కిరణ్ శ్యామ్, ఆశ్మిత్ నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ సినిమాలో ఒక సన్నివేశం చిత్రీకరించే సమయంలో దర్శకుడు, నిర్మాత తనను లైంగికంగా, మానసికంగా వేధించారనే విషయాన్ని స్పష్టం చేసింది చిత్రాంగద.

కథ మార్చి సెక్స్ సీన్ చేయాలని, చాలా సన్నిహితంగా ఉండాలని ఆ ఇద్దరూ తనపై ఒత్తిడి తెచ్చారని నటి చెప్పారు. ఆ సమయంలో హీరో నవజుద్ధీన్ అక్కడే ఉన్నా.. ఆయన చూస్తుండిపోయారే తప్ప తోటి ఆర్టిస్ట్ కి సహాయం చేయలేకపోయారని ఆవేదన వ్యక్తం చేసింది. 

ఇవి కూడా చదవండి.. 

సింగర్ చిన్మయి కామెంట్స్ పై రచయిత ఘాటు స్పందన!

నిన్ను రేప్ చేయాలి.. అంటే ఇలానే స్పందిస్తారు

నా చెస్ట్ టచ్ చేయడానికి ట్రై చేశారు.. సింగర్ చిన్మయి సంచలన కామెంట్స్!

ప్రముఖ లిరిసిస్ట్ పై లైంగిక ఆరోపణలు.. బాధితులకు చిన్మయి పిలుపు!